పెదాలు పొడిబారి పగిలినప్పుడు తగినన్ని నీళ్లు తాగడంతో పాటు ఈ జాగ్రత్తలూ తీసుకుంటే మేలు.
- చెంచా చొప్పున గులాబీ నీళ్లు, తేనె తీసుకుని పెదాలకు రాసి కాసేపు ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా రోజూ చేస్తుంటే పెదాలకు తగిన తేమ అంది తాజాగా కనిపిస్తాయి.
- పెదాలపై మృతకణాలు పేరుకున్నప్పుడు బొప్పాయి గుజ్జుకి కొంచెం పంచదార కలిపి రాయండి. వేళ్లతో ఓ రెండు నిమిషాలు రుద్దండి. మృదువుగా మారతాయి.