- ఉడకబెట్టిన ఆపిల్ గుజ్జులో కప్పు పాలు, రెండు చెంచాల ఓట్స్, కొద్దిగా తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే టాన్ తొలగిపోతుంది.
- పావుకప్పు ఆపిల్ గుజ్జుకి కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంటయ్యాక గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టుకి పోషణ అంది ఆరోగ్యంగా ఉంటుంది.
- పావుకప్పు ఆపిల్ గుజ్జులో చెంచా ఉలవపిండి, కలబంద గుజ్జు, కొద్దిగా తేనెని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి నలుగులా పెట్టుకుంటే చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
- మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో ముఖం కాంతివిహీనంగా మారినప్పుడు ఇలా చేయండి. పావుకప్పు ఆపిల్ గుజ్జులో చెంచా పాలపొడి, కొద్దిగా తేనె, టీస్పూన్ తులసి కలపాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక కడిగేస్తే మచ్చలు దూరమవుతాయి.
ఆపిల్‌తో ఆరోగ్యమే కాదు అంతకు మించి - beautiful skin tips for girls
అందాన్ని ఎవరు కోరుకోరు! మరి అందాన్ని పెంచుకోవాలంటే.. ఎన్నో చిట్కాలు చెబుతారు. చాలా సింపుల్‌గా అందంతో పాటు ఆరోగ్యం పెంచుకోవాలంటే... రోజుకో ఆపిల్ చాలు. ఎలాగంటే...
![ఆపిల్‌తో ఆరోగ్యమే కాదు అంతకు మించి apple for beautiful skin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7827511-834-7827511-1593492330832.jpg)
apple for beautiful skin