తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీ చిన్నారి పనిచేస్తేనే.. అడిగింది చేయండి! - children mischievous things

‘పక్కింటి హనీ దగ్గర ఉన్న నిలువెత్తు బార్బీబొమ్మ ఎంత బాగుందో... సరిగ్గా అలాంటిదో నాకూ కావాలి’ అని మారాం చేస్తుంది లక్కీ. ‘నానీకి వాళ్ల మమ్మీ హాట్‌వీల్స్‌ కొనిచ్చింది. నువ్వూ నాకు అలాంటిది కొనాల్సిందే’ అని పట్టుబడతాడు దీపు. ఇలాంటి చిన్నారులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. ఇదంతా పిల్లల్లో పోల్చి చూసుకునే మనస్తత్వాన్ని చెబుతుంది. అలాంటప్పుడు అమ్మగా మీరేం చేయొచ్చంటే!

tell your children to do some work if they ask you anything to buy
చిన్నారి మారాం చేస్తే పనిచెప్పండి

By

Published : Sep 27, 2020, 4:30 PM IST

పనిచేస్తేనే ఫలితం:

ఎదుటి వారి దగ్గర ఉన్నవి తనకూ కావాలని పిల్లలు మారాంచేస్తే చాలు వాటిని తమ పిల్లలకూ కొని పెట్టాలని కొంతమంది తల్లులు తాపత్రయపడుతుంటారు. ఇది ఎంత మాత్రం సరికాదు. పిల్లలు అడిగిన వెంటనే కొనేయకుండా ఫలానా పని చేస్తేనే కొనిస్తానని చెప్పాలి. అప్పుడు.. కష్టపడి పనిచేస్తేనే కోరుకున్నది సాధించవచ్చనే ఆలోచన ఆ చిన్నారి మనసులో ఉదయిస్తుంది.

ప్రత్యేక సందర్భాలు:

మంచి మార్కులు తెచ్చుకోవడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి అమ్మకు సాయపడటం చేసినప్పుడు పిల్లలు అడిగినవి కొనివ్వడంలో తప్పులేదు. ఇతరులను చూసి అవే కావాలనప్పుడు మాత్రం వెంటనే ఇచ్చేయకూడదు. అప్పుడప్పుడూ పెద్దవాళ్లు ఇచ్చిన డబ్బును పొదుపు చేస్తే.. వాటితో వారికి కావలసిన వస్తువులను వారే కొనుక్కోవచ్చనీ పిల్లలకు చెప్పవచ్ఛు దీనివల్ల డబ్బు పొదుపు చేయడమూ మెల్లగా అలవాటు అవుతుంది. ఒకవేళ అంత డబ్బును వాళ్లు పొదుపు చేయలేకపోయినా కొంత మొత్తాన్ని మీరూ వేసి కొనిపెట్టవచ్ఛు.

ABOUT THE AUTHOR

...view details