తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కోరిందల్లా ఇచ్చే ముందు.. ఇవి తెలుసుకోండి! - పిల్లలు కోరిందల్లా ఇచ్చే ముందు ఇవి తెలుసుకోండి

పిల్లలు ఏదో ఒక సందర్భంలో తమకు కావాల్సిందల్లా కొనివ్వాలని మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు వారి ధ్యాస మార్చాలని ప్రయత్నించినా వీలుకాదు. మరేం చేయాలంటారా?

కోరిందల్లా ఇచ్చే ముందు.. ఇవి తెలుసుకోండి!
కోరిందల్లా ఇచ్చే ముందు.. ఇవి తెలుసుకోండి!

By

Published : Mar 6, 2021, 12:16 PM IST

చిన్నారులు పదే పదే ఒకే వస్తువు కావాలని అడుగుతుంటే.. అదెందుకోసమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిజానికి దాన్ని కొనేవరకూ చూపించిన ఆసక్తి తర్వాత వారికి ఉండకపోవచ్చు. వాటిని వాడే విషయంలో కొన్ని నియమాలు పెట్టాకే... కోరింది ఇవ్వండి. అప్పుడే వాటిని సరిగా ఉపయోగిస్తారు.

  • పిల్లలు కోరిందల్లా ఇవ్వడం ఎంత తప్పో... ప్రతిదాన్నీ కాదనడం కూడా అంతే పొరబాటు. వారి ఇష్టాయిష్టాలను, ఆసక్తులను గమనించి ఇస్తే వాటిని శ్రద్ధగా వాడతారు. అవసరం, ఆసక్తిని బట్టే ఏదైనా కొనుక్కోవాలి అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా ఉదాహరణలతో చెప్పి చూడండి.
  • చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థికపరిస్థితి తెలిసేలా పిల్లల్ని పెంచాలి. కోరిన వస్తువును కొనే పరిస్థితులు ఇంట్లో ఉన్నాయో లేదో అనే ఆలోచన వారికి వచ్చేలా చేయాలి. ఏదీ సులువుగా రాదనే విషయాన్ని తెలుసుకునేందుకు... ఓ పని చేయండి. చిన్న చిన్న టాస్క్‌లు అప్పజెప్పండి. వాటిని పూర్తిచేస్తేనే అడిగినవి తెచ్చిస్తామనండి. అప్పుడు వారు దాని విలువ తెలుసుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details