మీరనుకున్నది నెరవేర్చుకోవడానికి పిల్లల్ని బెదిరించి, భయపెట్టడం వల్ల వారు తాత్కాలికంగా మీ మాట వినొచ్ఛు కానీ క్రమంగా వారు ఆ అంశాలపై అయిష్టతను పెంచుకుంటారు. క్రమంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్నీ ప్రతికూలంగా ఊహించుకుంటారు. ఇవి వారిలో లేనిపోని భయాల్ని సృష్టిస్తాయి. కుంగుబాటు, ఒత్తిడి వంటి మానసిక ఆందోళనలకు కారణం అవుతాయి.
పిల్లలను అమ్మగా లాలించండి కానీ... భయపెట్టొద్దు! - good parenting
పిల్లలు మాట వినడం లేదనో, లేక వారికి నచ్చని పని చేయించాలనో చాలామంది తల్లిదండ్రులు లేనిపోని భయాలను సృష్టిస్తారు. స్కూలు, టీచరు, ఇంజెక్షను ... ఇలా ఏదైనా కావొచ్ఛు కాస్త సున్నిత మనస్తత్వం కల పిల్లల్లో ఈ భయాలు పెద్దయ్యేకొద్దీ గూడుకట్టుకుపోతాయి...
special story on good parenting in telugu
పిల్లలకు మంచి చేసే విషయాలను నయానో, భయానో నచ్చచెప్పాలంటారు. అలాగని ప్రతిదానికీ ప్రతికూల దండాన్ని వాడొద్ధు అమ్మగా లాలించండి. మొదటి రోజు వారికి నిజంగానే నచ్చకపోవచ్ఛు ఓపిగ్గా ప్రయత్నిస్తే కొద్దిరోజుల్లోనే మీరు కోరుకున్న మార్పు సాధ్యం అవుతుంది.
ఇదీ చూడండి:కరోనా వేళ జిమ్‌లు ఎంత సురక్షితం?