విడదీయాలి... పిల్లలు తమకేదైనా కావాలని మారాం చేస్తుంటే... వాటిల్లో వారికి అత్యవసరమైనవి, కానివి అంటూ తల్లిదండ్రులు విడదీయగలగాలి. చదువుకు సంబంధించినవాటిని తక్షణం కొనివ్వాల్సి ఉంటుంది. అలాగని ఆడుకునే వాటిపై అశ్రద్ధ ప్రదర్శించకూడదు. అయితే అడిగిన వెంటనే అందించకుండా, వాటిని ఎందుకు కోరుతున్నారో వారినే అడిగి తెలుసుకున్న తర్వాత ఆలోచించాలి. ఇలా ఏది అవసరం, ఏది కాదు... అనేదానిపై వారికి అవగాహన కలిగించాలి.
అదుపులో...చిన్నారులు కోరేవి కొన్నిసార్లు ఎక్కువ ఖరీదు ఉంటాయి. అది వారికి తెలియకపోవచ్చు. అంతేకాదు, ఇతరుల వద్ద చూసినవి కూడా తమకు కావాలనుకునే పసితనం వారిలో ఉంటుంది. వాటిని కొనగలిగే స్థాయి ఉన్నా లేదా లేకపోయినా వెంటనే మాత్రం ముందడుగు వేయకూడదు. వాటి విలువ, దానికోసం కావాల్సిన నగదు, అదెలా వస్తుందో అనే విషయాలను మృదువుగా పిల్లలకు వివరించాలి. కొనివ్వను అని ఒకేసారి వారిపై కోప్పడకుండా, దాని వెనుక ఉన్న కారణాలను వారికి చెప్పాలి. ఆ తర్వాత వారి కోరికలు కొన్ని అదుపులో ఉంటాయి.