తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లలు గమనిస్తారు.. తల్లిదండ్రుల్నిఅనుకరిస్తారు... - Children behavior

పిల్లల పెంపకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. అలాంటివారిలో మీరు ఉన్నారా... అయితే ఇది మీ కోసమే.

parents should observe Children behavior
పిల్లల ప్రవర్తన

By

Published : Nov 2, 2020, 2:19 PM IST

Updated : Nov 3, 2020, 12:01 AM IST

* చిన్నారుల బలాలను గుర్తించి ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేయాలి. సాధించగలమనే నమ్మకాన్ని చిన్నతనం నుంచీ పెంచాలి.

* ప్రవర్తనా పరమైన పొరపాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దాలి. పిల్లలు ఏదైనా తప్పుచేస్తే వెంటనే వాళ్ల మీద గట్టిగా అరవడం, దండించడం చేయకూడదు. ఆ పొరపాటును మళ్లీ మళ్లీ చేయకుండా ఉండేలా అర్థమయ్యేలా చెప్పాలి.

* పిల్లల బలహీనతలు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి వాటిని అధిగమించడంలో వారికి సహకరించాలి తప్ప కోప్పడకూడదు.

* చిన్నారులు ఎలాంటి సంకోచం లేకుండా తమ భావాలను తల్లిదండ్రులతో పంచుకునేలా ప్రోత్సహించాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు.

* అమ్మానాన్నల సెల్‌ఫోన్లు తీసుకుని ఎక్కువ సమయం గడుపుతుంటారు కొందరు పిల్లలు. అలాంటివారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఏయే వెబ్‌సైట్లు, వీడియోలు చూస్తున్నారో గమనిస్తుండాలి.

* పిల్లలెప్పుడూ తల్లిదండ్రులను గమనిస్తూ, అనుకరించడానికే ప్రయత్నిస్తారు. వాళ్లకు మీరే రోల్‌మోడల్‌. మీరు అతిగా ప్రవర్తిస్తే వాళ్లూ అదే నేర్చుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పుతో వ్యవహరించాలి.

Last Updated : Nov 3, 2020, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details