అన్నం తినకపోతే బూచోడికి పట్టిస్తా.. మాట వినకపోతే టీచర్‌కు చెబుతా.. అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో తెలియని భయాలను కలిగించడం సరికాదంటారు మానసిక నిపుణులు.
పిల్లల్ని భయపెట్టి పనిచేయించాలనుకోవడం పొరబాటు. ఇలా తరచూ చేస్తుంటే మీ మాట లెక్క చేయని పరిస్థితీ ఎదురుకావొచ్చు. అలాకాకుండా కష్టం విలువ తెలియజేయండి. ఆ పని చేయకపోవడం వల్ల ఎదురయ్యే నష్టాలను అర్థమయ్యేలా చెప్పండి. మొదట్లో కాస్త వెనుకాడినా...క్రమంగా వాస్తవాలను అర్థం చేసుకోవడానికి అలవాటు పడతారు.