తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీ పిల్లలు తరచూ గొడవపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి - పిల్లల తగాదాలు నివారణకు పరిష్కారం

ఇద్దరు పిల్లలున్న ఇళ్లల్లో సాధారణంగా చిన్నచిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి. ఇవి మామూలే అన్నట్టుగా వీటిని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. అలాగని ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసి భయపడకూడదు. అయితే మరేం చేయాలంటారా... ఇదిగో ఇలా ప్రయత్నించి చూడండి.

solution for often fights in children
మీ పిల్లలు తరచూ గొడవపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి

By

Published : Oct 8, 2020, 8:59 AM IST

  • సమానమే:

తల్లిదండ్రులు ముందుగా ఇద్దరినీ సమానంగా చూడటం మొదలుపెట్టాలి. కొంతమంది క్రమశిక్షణ పేరుతో పెద్ద పిల్లలను ఎక్కువగా మందలిస్తూ, చిన్నవాళ్లను మరీ గారాబం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులకు నాకంటే ఎదుటివాళ్లే ఇష్టమని అపోహపడి వారిపై అనవసరంగా అసూయను పెంచుకుంటారు. క్రమేపీ అది పెరిగి పెద్దదవుతుంది.

  • కారణం కనుక్కోవాలి

సాధారణంగా ఎక్కువ ఇళ్లల్లో పిల్లల మధ్య తగాదాలకు కారణం టీవీ రిమోటే అవుతుంది. పిల్లలు ఇద్దరూ టీవీ చూడాలనుకుంటారు. కానీ చెరో ఛానెల్‌ కావాలంటారు. ఇలాంటప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో సమయాన్ని కేటాయించాలి. అలాగే అమ్మానాన్నల సెల్‌ఫోన్‌ తీసుకుని గేమ్స్‌ ఆడే విషయంలోనూ గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడూ ఇద్దరికీ చెరో సమయాన్నీ కేటాయించాలి.

  • కలిసి పనిచేయడం

గొడవ పడతారని పిల్లల్ని కలవనీయకుండా చేయకూడదు. వేర్వేరు పనుల్ని అప్పగించకూడదు. ఇంటికి సంబంధించిన కొన్ని పనులను ఇద్దరూ కలసి పూర్తిచేసేలా చూడాలి. ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదా మొక్కలకు నీళ్లు పోయడం లాంటి తేలికైన పనులు ఇస్తుండాలి. దీనివల్ల కలసిమెలసి పనిచేయడం చిన్నతనం నుంచీ అలవాటవుతుంది.

  • మాట్లాడుతుండాలి

ఏ కాస్త సమయం చిక్కినా పిల్లలిద్దరితో తల్లిదండ్రులు మాట్లాడుతుండాలి. వాళ్ల చిట్టి బుర్రలకు వచ్చే చిన్నిచిన్ని సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తుండాలి. కుటుంబమంతా ఒకటేననే భావనను వాళ్ల మనసులో బలంగా నాటాలి. దాంతో చిన్న చిన్న విషయాలకు సంకుచితంగా ఆలోచించి గొడవపడటం మానేస్తారు.

ఇదీ చదవండిఃపిల్లల్ని అలా మలిచేద్దాం...

ABOUT THE AUTHOR

...view details