పిల్లల్లోని కోపం, ఆవేశం, అక్కసూ, అసూయ, భయం వంటివాటిని చూపి వాళ్లని చెడుగా మాట్లాడకండి. అపరాధభావం కలిగించకండి. వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఎప్పుడూ ఉండేలా చూడండి. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయని.. పోరాటపటిమగా మార్చుకోవచ్చని వివరించండి. ఉద్వేగ ప్రజ్ఞ అంటే అదే మరి!
దయ: జీవితంలో ప్రేమించడం, ప్రేమ పొందడంకన్నా ఆనందం మరేదీ ఉండదు. పెద్దలుగా మనమూ నిస్సహాయులపై కరుణ చూపించగలగాలి. దాన్నే పిల్లలూ అనుసరిస్తారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే ఓపికను అలవాటు చేయాలి. అప్పుడప్పుడూ అయినా ఎవరైనా బాధలో ఉంటే అందుకు కారణాలను తెలుసుకోమనండి. వాటికి పరిష్కారాలూ సూచించమనండి. ఇవన్నీ వారిలో ఆలోచనా శక్తిని పెంచుతాయి. నిరుపేద చిన్నారుల విద్యకు సాయం చేయడం, పెద్దలకు సాయం చేసేలా చేయడం వంటివన్నీ వారిలో ఈ ఉద్వేగాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి.