తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లల తెర సమయం ఈ విధంగా తగ్గిద్దాం

కొవిడ్​ ప్రభావంతో చాలా వరకు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఆన్​లైన్​ క్లాసులు, ఎంటర్​టైన్​ మెంట్​ కోసం ఫోన్లు, ట్యాబ్​లు, ల్యాప్​టాప్​ల వాడాకాన్ని ఎక్కువగా పెంచారు. మరికొంత మంది పిల్లలు పరిమితికి మించి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలని స్క్రీన్ల వాడకం నుంచి తప్పించాలంటే ఈ సూచనలు పాటించండి.

children’s screen time
పిల్లల తెర సమయం ఈ విధంగా తగ్గిద్దాం

By

Published : Jun 26, 2021, 1:33 PM IST

కరోనా వల్ల పిల్లలు ఇళ్లకే పరిమతమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులు, వినోదం అన్నీ ట్యాబ్‌లు, మొబైళ్లు, కంప్యూటర్‌ తెరల మీదే. దాంతో అవసరానికి మించి ఎక్కువగానే అలవాటు పడ్డారు. బలవంతంగా మాన్పించాలనుకుంటే మొండికేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

వారితో గడపండి: పిల్లలతో పెద్దలు ఒక్కోసారి సరిగా మాట్లాడకపోవడం, తగినంత సమయం కేటాయించలేకపోవడం వల్ల కూడా వీరు స్క్రీన్‌ టైమ్‌కి అలవాటు పడుతుంటారు. ముందు మీరు వాటికి దూరంగా ఉండండి. చిన్నారులతో తగినంత సమయం గడపండి.

ఆటలాడించండి:ఇప్పుడు పిల్లల ప్రపంచం నాలుగ్గోడలకే పరిమితం అయింది. వారు కాలక్షేపానికో, వినోదానికో టీవీలకు, కంప్యూటర్‌లకు అతుక్కుపోతున్నారు. ఆ సమయాన్ని వేరే వాటిపై మళ్లించడానికి ప్రయత్నించండి. ఇండోర్‌ గేమ్స్‌, హాబీలు వంటివి ఉత్సాహంగా ఉంచుతాయి. క్యారమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌, పదవినోదం, దాగుడు మూతలు, స్కిప్పింగ్‌, మెట్లెక్కి దిగడం వంటివి ఏవైనా కావొచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. సమయాన్ని చక్కగా వినియోగించుకునేలా చేస్తాయి.

సమయం నిర్దేశించండి:రోజువారీ ప్రణాళికతో పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర దిన చర్యనూ సమయానికి అనుగుణంగా పూర్తిచేసినట్లే... టీవీ /ఫోన్‌ /కంప్యూటర్‌ వంటివి చూసేందుకు కేటాయించండి. అప్పుడు దానికి అలవాటు పడతారు. అలానే అది పెద్దల పర్యవేక్షణలోనే సాగాలి. అప్పుడు వారూ అదుపాజ్ఞల్లో చూస్తారు.

ఇదీ చూడండి:Water War: ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details