తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లల్లో మంచి అలవాట్లు పెంచుదామిలా...!

మొక్కగా ఉన్నప్పుడు మార్చితేనే... మాను బాగుంటుంది. పిల్లల పెంపకంలోనూ ఇదే వర్తిస్తుంది. చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలతో పెంచితే పెద్దయ్యాక ఉత్తములుగా ఉంటారు.

Let's inculcate good habits in children
పిల్లలకు మంచి అలవాట్లు పెంచుదామిలా...!

By

Published : Aug 3, 2020, 4:24 PM IST

  • చిన్నారులకు సంబంధించిన అన్ని విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్ధు ఎవరైనా ఏదైనా అడిగినా, ఏదైనా టాస్క్‌ అయినా... వారే స్వయంగా సమాధానం చెప్పేలా ప్రోత్సహించండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
  • బాల్యం నుంచే వారికి డబ్బు విలువ తెలియజేయండి. అనవసరమైన వాటిని సైతం కొనివ్వమని మారం చేస్తారు కొందరు చిన్నారులు. వారు ఇవ్వమన్నది ఎంత వరకు అవసరమో వివరించండి. ఆ తరువాతే కొనిపెట్టండి.
  • ఇంట్లో చిన్నచిన్న పనులను వారితో చేయించడం, పెద్ద వాళ్లకు సహాయపడేలా ప్రోత్సహించడం వంటివి చేయాలి. ఇవి వారిలో జిజ్ఞాసను, సహానుభూతిని పెంచుతాయి.
  • సానుకూల దృక్పథం, ధైర్యం, ఆత్మవిశ్వాసం... ఇవి మానసికస్థైర్యాన్ని పెంచుతాయి. పిల్లలకు బాల్యంలో నీతి, సాహస కథలు చెబితే వీటిని పెంపొందించుకుంటారు. కొంచెం పెద్దయ్యాక పుస్తకాలు చదివించడం అలవాటు చేస్తే మరింత నేర్చుకోగలుగుతారు.

ABOUT THE AUTHOR

...view details