తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లలు.. వాళ్లంతట వాళ్లే తినాలంటే ఇలా చేసేయండి!

పిల్లలకు తినిపించడమే తమకు పెద్ద సమస్య అనే తల్లులు చాలామందినే మనం చూసుంటాం. వారంతట వారుగా తినడం, అడిగి మరీ ఆకలి తీర్చుకోవడం వంటివి పిల్లలు ఎందుకు చేయలేకపోతున్నారు. వారు చక్కగా తినాలంటే ఏం చేయాలి? చూద్దామా!

By

Published : Sep 19, 2020, 11:43 AM IST

mother has to cook protein food to children
పిల్లలు.. వాళ్లంతట వాళ్లే తినాలంటే ఇలా చేసేయండి!

చాలామంది తల్లులు పిల్లల కడుపు నింపాలనే ఉద్దేశంతో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే కుక్కి పెడుతుంటారు. దీనివల్ల పిల్లలు తినడం అంటేనే... అయిష్టత పెంచుకుంటారు. అలాకాకుండా ముందు వారికి ఏం ఇష్టమో తెలుసుకోవాలి. అవి రుచి చూపిస్తూనే, మరో పదార్థాన్నీ దానికి కలగలిపి వండాలి. అలా క్రమంగా అన్ని రకాల వంటకాల్నీ ఇష్టపడేలా చేయాలి.

చిన్నారికి అన్ని పోషకాలు అందేలా చూడటంలో తల్లిగా మీదే కీలకపాత్ర. పిల్లలు ఎప్పుడూ ఒకే తరహా రుచుల్ని ఇష్టపడకపోవచ్ఛు బయటదొరికే జంక్‌ఫుడ్‌కి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ రుచుల్లో కాయగూరలూ, ఆకుకూరల వంటివాటితో ప్రయత్నించండి. అలానే వండేది ఏదైనా సరే చక్కటి రుచితో పాటు కంటికింపుగానూ ఉండేలా చూసుకోవాలి. సువాసన... తినాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే వాటిపై మిరియాలపొడి, మసాలాలు, కొత్తిమీర వంటివి చల్లండి. ఇవన్నీ వారి దృష్టిని ఆకర్షించేందుకు సాయపడతాయి.

ఇదీ చదవండిఃబయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట !

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details