మీ పిల్లల్లో మనోధైర్యం నింపండిలా...! - good parenting
విజేతలుగా నిలిచిన ఎంతోమంది తమ ఉన్నతికి తల్లిని కారణంగా చెబుతారు. అటువంటి పాత్రను పోషించే తల్లిలో పిల్లలు ఓ మెంటర్‌తోపాటూ స్నేహితురాలినీ చూస్తారు. పిల్లల్తో ఈ బంధాన్ని చిన్నప్పటి నుంచే పెంపొందించుకోవాలి...
మీ పిల్లల్లో మనోధైర్యం నింపండిలా...!
స్కూల్‌కు వెళ్లాల్సిన అమ్మాయి ఇంకా మంచంపైనే ఉందంటే అందుకు ఏదో కారణం ఉండి ఉంటుంది. నెమ్మదిగా అడిగితే అది అనారోగ్యమా లేక మానసిక ఆందోళనా అన్నది తేలుతుంది. దాన్ని గుర్తించగలిగి, అందుకు తగ్గ చికిత్స చేయగలిగితే చాలు. ఆ అమ్మాయికి తల్లి స్నేహితురాలిగా మారినట్లే.
- ఉద్యోగిని లేదా వ్యాపారిగా బయట ఎన్ని విజయాలు సాధించినా, ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇల్లాలిగా మారే మహిళలే పిల్లల మనసులను అర్థం చేసుకోగలరు. వారి అవసరాలను గుర్తించే ఆప్తురాలిగానూ మారగలరు.
- ఎటువంటి సమస్యలొచ్చినా పిల్లల ఎదుటకు తీసుకురాకూడదనే నియమాన్ని పాటించడం కన్నా, ఆయా వయసునుబట్టి వారికీ ఇంట్లో సమస్యలను చెప్పగలగాలి. తరువాత దాన్ని ప్రశాంతంగా ఎలా పరిష్కరించారో కూడా వివరించాలి. ఈ పద్ధతితో అమ్మ సామర్థ్యాన్ని పిల్లలు నేర్చుకోవడం మొదలుపెడతారు. ఆమె వ్యక్తిత్వం ఎంత బలమైందీ అనేది వారి మనసులో ముద్రపడుతుంది. అది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
- పిల్లల్లో కుంగుబాటును చూసినప్పుడు అందులోంచి వారిని బయటకు తీసుకురాగలగాలి. జీవితంలో ప్రతి మెట్టునూ ఆస్వాదిస్తేనే ముందుకు నడవగలమనే నిజాన్ని వారికి సున్నితంగా చెప్పగలిగితే చాలు. ఎటువంటి సందర్భంలోనైనా తల్లితో తమ భయాలను, అనుభవాలను పంచుకోగలగాలి.
Last Updated : Aug 10, 2020, 11:18 AM IST