కాన్పు తర్వాత బాలింతల్లో మొదట వచ్చే పాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. దీన్నే కొలెస్ట్రమ్ అంటాం. పోషకాలు పుష్కలంగా ఉండే ఇది చాలా తక్కువ మొత్తంలోనే అందినా పాపాయి అవసరాలకి సరిపోతుంది. రోజులో ఒకటి నుంచి నాలుగు చెంచాల పాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి చిన్నారి పుట్టిన రెండు నుంచి అయిదు రోజుల వరకు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత కొలెస్ట్రమ్, సాధారణ పాలు రెండూ కలిసి అందుతాయి. కొలెస్ట్రమ్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనో గ్లాబ్యూలిన్-ఎ (ఐజీఏ) అనే కారకాలు మెండుగా ఉంటాయి.
పోషకాల పరంగా...
సాధారణ తల్లిపాలతో పోలిస్తే ఈ కొలెస్ట్రమ్‌లో మాంసకృత్తులు ఎక్కువ. కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ. దీని నుంచే మేలు చేసే బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందుతుంది. పాపాయి పుట్టిన వెంటనే ఈ పాలు పట్టించాలి. దాంతో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే ఈ పాలలో యాంటీబాడీస్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాపాయి బయటకు వచ్చాక కావాల్సిన పోషణ, రక్షణ... రెండూ ఈ కొలెస్ట్రమ్ నుంచే లభిస్తాయి.
లాభాలు...