పిల్లల్లో చర్మం పొడిబారకూడదంటే ఏం చేయాలి? - health news
మేడం.. పిల్లల్లో చర్మం పొడిబారే సమస్య (డ్రై స్కిన్ ప్రాబ్లం) తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చెబుతారా?- ఓ సోదరి
![పిల్లల్లో చర్మం పొడిబారకూడదంటే ఏం చేయాలి? home remedies for dry skin in children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8258855-67-8258855-1596288088100.jpg)
పిల్లలంటే ఏ వయసు పిల్లలకు అనేది మీరు రాయలేదు. సాధారణంగా నెలల వయసున్న పిల్లలకైతే పాల మీగడ, వెన్న.. వంటివి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అలాగే ఐదేళ్లు దాటిన పిల్లలైతే బాదం నూనె రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను చర్మానికి రాసుకుంటే అది చర్మంలోకి బాగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు కూడా గ్లిజరిన్ ఆధారిత సబ్బుల్ని ఉపయోగిస్తే మరీ మంచిది. తద్వారా చర్మం పొడిబారే సమస్యను తగ్గించుకోవడంతో పాటు మేను మెరుపును సంతరించుకుంటుంది. ఐదేళ్ల పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా ఈ చిట్కాను పాటించచ్చు. అలాగే ముందు నుంచీ ఈ నూనె ఉపయోగిస్తున్నట్లయితే శీతాకాలంలో చర్మం పొడిబారే సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.