తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

PARENTING TIPS: మంచి మాటలు చెప్తే పోయేదేముంది డూడ్..

పిల్లలు అడిగిందల్లా కొనిస్తూ... వారికి ఏ లోటు లేకుండా చూడటమే తల్లిదండ్రుల బాధ్యత కాదండోయ్. వారి అలవాట్లు, ప్రవర్తన వంటివన్నీ గమనిస్తూ వారిని మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దే బాధ్యత కన్నవాళ్లదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.

four-tips-to-teaching-children-manners-and-common-courtesy
మంచి మాటలు చెప్తే పోయేదేముంది డూడ్.. మహా అయితే మంచిగా మాట్లాడతారు..

By

Published : Jul 17, 2021, 11:59 AM IST

ఇంటికెవరైనా వచ్చినప్పుడు తన తొమ్మిదేళ్ల కొడుకు భార్గవ్‌ను పలకరించాలంటే జయకు భయం. మర్యాద లేకుండా మాట్లాడతాడు. తల బిరుసుగా ప్రవర్తిస్తాడు. ఈ తీరుకి ఆదిలోనే చెక్‌ పెట్టాలంటారు మానసిక నిపుణులు. అదెలాగంటే...

చులకన చేసుకోవద్ద్దు...

పుట్టినప్పుడు పిల్లలందరూ ఒకేలా ఉంటారు. వారి అలవాట్లు, ప్రవర్తన వంటివన్నీ తన చుట్టూ ఉన్నవారి నుంచి చూసి క్రమేపీ నేర్చుకుంటారు. దీన్ని సరిచేయాలంటే ముందుగా తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలి. చిన్నారుల ఎదుట ఆలుమగలు ఒకరినొకరు చులకన చేసుకుంటూ, అవమానించుకుంటూ మాట్లాడుకోకూడదు. ఎందుకంటే పిల్లలు వాటినే అలవాటు చేసుకుంటారు.

మాటతీరు ముఖ్యం...

పిల్లలు తమకంటే వయసులో పెద్దవారిని హేళన చేస్తున్నా... వారితో మితిమీరి ప్రవర్తిస్తున్నా చూసీ చూడనట్లు ఉండొద్దు. అలానే అమ్మ తరఫునో, నాన్న వైపో ఉండి... మరొకరిని తక్కువ చేసి మాట్లాడుతుంటే మురిసిపోవద్దు. తప్పని ఖండించండి. అలానే ఎదుటివారిని పిలిచే తీరు, సమాధానం చెప్పే విధానంలో మన్నింపు ఉండేలా చూడండి. కుటుంబ సభ్యులు కూడా... ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే చాలు. ఆ పద్ధతినే అనుసరిస్తారు వారు.

మర్యాద నేర్పండి...

పెద్దవాళ్లకు పిల్లలు అద్దాల్లాంటి వారు. వారెలా ఉంటే చిన్నారులు దాన్ని ప్రతిఫలించేలా కనిపిస్తారు. ఇంట్లో పిల్లలెదుట బయటివారిని లేదా స్నేహితుల గురించి అవహేళనగా మాట్లాడకూడదు. ఇది ఆ చిన్నారుల మనసులో నాటుకుంటుంది. క్రమంగా వారు కూడా అలాగే మాట్లాడటం మొదలుపెడతారు. అందుకే ముందు మీరు ఆదర్శంగా ఉండండి. ఇంటికి ఎవరైనా వస్తే.. వారితో మర్యాదగా ప్రవర్తించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు... సరళమైన భాషను వాడండి.

ఇదీ చూడండి:parenting tips: చిన్నారుల వికాసానికి పంచసూత్రాలు..!

ABOUT THE AUTHOR

...view details