తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈ ముద్రలతో శ్వాస సమస్యలకు చెక్ - yoga to cure breathing problems

ప్రస్తుత పరిస్థితుల్లో శ్వాస సమస్యలు లేకుండా చూసుకోవడం ఎంతో అవసరం. వాటి సామర్థ్యాన్ని పెంచే ముద్రలు, ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేమిటంటే...

yoga asanas and mudras to cure breathing problems yoga asanas and mudras to cure breathing problems
ఈ ముద్రలతో శ్వాస సమస్యలకు చెక్

By

Published : Jul 26, 2020, 7:53 AM IST

శ్రీలింగముద్ర:

సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతుల వేళ్లను కలిపి బొటనవేలు పైన ఉంచాలి. మహిళలు ఎడమ బొటనవేలు, మగవాళ్లు కుడి బొటనవేలు పైకి ఉంచాలి. చేతులు శరీరానికి తాకకుండా నాభికి, హృదయానికి మధ్య ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఈ ముద్రలో కూర్చోవాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం ఈ ముద్ర వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా కూర్చుని ధ్యానం కూడా చేయొచ్చు.

శలభాసనం:

బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరకు ఉంచాలి. రెండు చేతులు కిందకు పెట్టుకోవాలి. అరచేతులు నేలవైపు ఉండాలి. రెండు మోకాళ్లను మడిచి మెల్లగా పైకి లేపాలి. చేతుల మీద బరువు వేస్తూ భుజాలు, తల పైకి లేపి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండి తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details