తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

క్యాన్సర్​ రాకుండా కీరాదోస..! - తెలంగాణ వార్తలు

వేసవి కాలంలో శరీరానికి చలవ చేయాలంటే కీరాదోసను తినాలని అంటున్నారు నిపుణులు. ఫలితంగా చల్లచల్లగా ఉండడమే కాకుండా అనేక పోషకాలు అందుతాయని చెబుతున్నారు. కీరాతో కలిగే ఆ లాభాలేంటో తెలుసుకుందాం..!

keera dosa uses, keera help to health
కీరాతో ప్రయోజనాలు, కీరాదోసతో ఆరోగ్యం

By

Published : Apr 3, 2021, 10:38 AM IST

మండుటెండల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారా... అయితే నిరభ్యంతరంగా కీరదోసను ఎంచుకోవచ్చు. ఎందుకంటే...

  • కీరదోసలో విటమిన్‌-ఎ, సి, క్యాల్షియం, ఇనుము, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు జీవక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడతాయి.
  • దీంట్లో తొంభైశాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. కిడ్నీ, మూత్రాశయ సమస్యలు రాకుండా చేస్తుంది.
  • శరీరంలో అవసరానికి మించి వేడి ఉంటే రక్తనాళాలు గట్టిపడే అవకాశం ఉంటుంది. రక్తసరఫరాలో అవాంతరాలు ఏర్పడి గుండెకు సంబంధిత వ్యాధులూ వచ్చే ప్రమాదముంటుంది. కీరాను తీసుకుంటే అలాంటి సమస్యల నుంచి బైటపడొచ్చు.
  • రోజూ మధాహ్న భోజనానికి ముందు కీరాను తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంట్లోని ఎంజైమ్‌లు ఆకలిని పెంచుతాయి.
  • మధుమేహగ్రస్తులకూ ఇది మంచి ఆహారం. కీరాలో ఉండే విటమిన్‌-సి వల్ల రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
  • కీరాను తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య ఉండదు. కొలెన్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుందని కొన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి.
  • దీంట్లో నీరు, పీచు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details