Heart :గుండెను పదిలంగా కాపాడుకుందాం - healthy heart tips
శరీరంలో దేని ప్రాముఖ్యం దానికున్నా.. గుండె మరింత ప్రధానమైంది. అది కనుక మొరాయించిందంటే ఇక అంతే సంగతులు. కనుక దాన్ని పదిలంగా కాపాడుకుందాం..
గుండె, ఆరోగ్యకరమైన గుండెకు చిట్కాలు
ఇతర జబ్బులు నెమ్మదిగా దాడి చేస్తాయి. కానీ గుండెపోటు మాత్రం అకస్మాత్తుగా వచ్చేసి ఇంటిల్లిపాదినీ ఆందోళనలోకి నెట్టేస్తుంది. గుండెకు సంబంధించిన ప్రతి సమస్యనీ నివారించలేకున్నా అధికశాతం సంరక్షించుకోవడం మన చేతిలోనే ఉంటుంది.
- పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఇంటి బాధ్యతలతో ఒత్తిడి ఎక్కువ. ఇది మితిమీరితే గుండెమీద ప్రభావం చూపుతుంది కనుక దాన్ని తగ్గించుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించుకుని ఇష్టమైన వ్యాపకాలతో కులాసాగా గడపండి.
- ఎంత తీరిక లేకున్నా అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయండి. అది చాలా అవసరం.
- దేని గురించీ అతిగా ఆలోచించి ఆందోళన చెందకండి. అది గుండెమీద భారం మోపుతుంది. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి, లేదా ఆత్మీయుల సలహా తీసుకోండి.
- రక్తపోటు ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి. జీవన సరళితోనూ బీపీని చాలావరకూ తగ్గించుకోవచ్చు.
- పోషకాహారం తీసుకోండి. కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూసుకోండి.
- రోజంతా పడిన అలసట తీర్చేది నిద్రే. మీ వయసును బట్టి ఆరు నుంచి ఏడు గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.
- ఇదీ చూడండి:Etela Rajender: హస్తినకు ఈటల.. భాజపాలో చేరిక జూన్ 2 తర్వాతే..!