మూడు పెద్ద చెంచాల బియ్యప్పిండి, చెంచా తేనె, రెండు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పూతలా వేయండి. ఆపైనో మూడు నిమిషాలాగి వేళ్లను నీళ్లతో తడుపుకుంటూ రుద్దాలి. ఇలా ఓ పదిహేను నిమిషాలు చేస్తే సరి. వెనిగర్‌లోని ఆమ్లం మృతకణాలను మృదువుగా మారిస్తే.. బియ్యప్పిండి వాటిని సులభంగా తొలగిస్తుంది. తేనె యాంటీసెప్టిక్‌లా పనిచేసి పగుళ్లను తగ్గిస్తుంది.
పగిలిన పాదాలకు అరటిపండు పూత! - how to get rid of feet crack
అందమైన మోమును పదే పదే చూసుకుంటాం. దాని సంరక్షణకు ఎన్నో చిట్కాలు, పద్ధతులు పాటిస్తాం. అదే పాదాల దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యం వహిస్తాం. అలా చేయకుండా అందుబాటులో ఉండే పదార్థాలతోనే వాటిని మృదువుగా, ఆరోగ్యంగా మార్చేయొచ్చు.

పగిలిన పాదాలకు అరటిపండు పూత!
బాగా మగ్గిన అరటిపండ్లను గుజ్జుగా చేసి, దానికి చెంచా పంచదార, కాస్త తేనె కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. పావుగంటయ్యాక నీటితో శుభ్రంగా కడిగేయాలి. అరటిపండు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇందులోని ఎ, బి6, సి విటమిన్లు చర్మానికి కావాల్సిన తేమను అందించి సమస్యను తగ్గిస్తాయి.