తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే అది మాత్రమే సరిపోదు!

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు.. ఏ సమయంలో తినాలి.. ఎంత మోతాదులో తినాలో కూడా తెలియాలి. కేవలం ఆహారమే కాదు.. ఇతరత్రా అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి వాటిపై కూడా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటంటే..?

By

Published : Jun 15, 2021, 11:43 AM IST

health tips, health hacks, food tips
ఆరోగ్య చిట్కాలు, ఆహార చిట్కాలు

ఆరోగ్యం కోసం చాలామంది ఆహారంపై దృష్టిపెడుతుంటారు. కానీ అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటారా?

  • టీవీ చూసేటప్పుడు చిరుతిండి తినడం చాలామందికి అలవాటు. దాని ధ్యాసలోపడి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పనిచేస్తూ, డ్రైవింగ్‌లో, ఆఖరికి నడిచేటప్పుడూ తినొద్దట. తెలియకుండానే ఎక్కువ తినేసే అవకాశముంటుందట.
  • తినే ప్రతిదాన్నీ కెలొరీల లెక్కలేసుకోవద్దు. ఇది ఆహారంపై అయిష్టతకి కారణమవుతుంది. అలా కాకుండా మీ శరీరానికి ఏం కావాలో, ఎంత కావాలో తెలుసుకుని, తీసుకోండి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
  • ఒత్తిడి, బాధలో ఉన్నపుడూ తిండివైపు మొగ్గుతుంటారు కొందరు. ఏవి తింటున్నారో, ఎంత తింటున్నారో మర్చిపోతుంటారు. ఇలాంటప్పుడు తిండి కాకుండా మనసును కుదుటపరిచే వేరే ప్రత్యామ్నాయాలను చూడాలి.
  • డైట్‌లో ద్రవాలకూ ప్రాధాన్యమివ్వాలి. కానీ వాటిపైనే ఆధారపడొద్దు. తొందరగా జీర్ణమై ఆకలేస్తుంటుంది. అవి ఆకలిని కాసేపు ఆపినా.. శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.
  • దేనికైనా త్వరిత ఫలితం కావాలంటారు చాలామంది. అందుకే వెంటనే డైట్‌ మార్చేస్తుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. ఒక విధానానికి శరీరం అలవాటు పడి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి :వ్యసనాలకు... 'విటమిన్‌ డి'కి ఏంటి సంబంధం..?

ABOUT THE AUTHOR

...view details