తినే పదార్థాల్లో జింక్, ఇనుము, ఫోలిక్‌యాసిడ్లు ఉండేలా చూసుకోవాలి. అలానే విటమిన్-ఎ ఎక్కువగా ఉండే చిలగడదుంప, పాలకూర, క్యారెట్లు, పాలు, గుడ్లు తీసుకోవాలి. వీటితో పాటు విటమిన్-డి లభించే చేపలు, పుట్టుగొడుగులు వంటివి తినాలి. తృణధాన్యాలు, బాదం, మాంసం, చేప, ఆకుకూరల్లో బయోటిన్ దొరుకుతుంది. స్ట్రాబెర్రీలు, కమలాలు, జామకాయలు వంటి పండ్లలో విటమిన్-సి ఉంటుంది. విటమిన్-ఇ, ప్రొటీన్ లభించే పనీర్, పొద్దు తిరుగుడు గింజల్నీ తరచూ తింటే మంచిది. నువ్వులను బెల్లంతో కలిపి తినొచ్చు. గుమ్మడిగింజలు, గోధుమగడ్డి, కందిపప్పు, సెనగపప్పులో జింక్ దొరుకుతుంది. ఈ పోషకాలన్నీ కలగలిసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు.
ఇలా చేస్తే జుట్టు రాలడం నివారించవచ్చు..! - tips for thick hair and remedy for hairfall
కొవిడ్ బారినపడ్డ చాలామంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వాడిన యాంటీ వైరల్స్, స్టెరాయిడ్ల వల్ల ఇలా జరుగుతుందని ప్రముఖ కాస్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని అన్నారు. ఒత్తిడి, భయం, నీరసం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్లా ఈ ఇబ్బంది రావొచ్చని తెలిపారు. మరి తిరిగి ఈ జుట్టు వస్తుందా? ఉన్న జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె ఏం చెప్పారంటే..
ఇలా చేస్తే జుట్టు రాలడం నివారించవచ్చు
జాగ్రత్తలు:శారీరక వ్యాయామం, ధ్యానం తప్పనిసరి. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగాలి. హెయిర్‌డైలు, ఇతర రసాయన చికిత్సలకు దూరంగా ఉండాలి. గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్ వాడాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఊడిన జుట్టు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయినా ఫలితం లేకపోతే డాక్టర్‌ని సంప్రదిస్తే విటమిన్, బయోటిన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అలాగే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) పద్ధతి ద్వారా కూడా జుట్టు ఊడటాన్ని నియంత్రించవచ్చు.
- ఇదీ చూడండి :మీ జుట్టుకు కరివేపాకు పెట్టారా?