తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Beauty Tips: నిగనిగలాడే ఒత్తయిన కురులు మీకూ కావాలా..?

అమ్మాయిల నుంచి మహిళల దాకా ప్రతి ఒక్కరికీ... ఒత్తయిన జుట్టు(THICK HAIR) కావాలని ఉంటుంది. మరి అలాంటి కురులు మీ సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా...

tips-for-long-and-thick-hair
నిగనిగలాడే ఒత్తయిన కురులు మీకూ కావాలా..?

By

Published : Jul 9, 2021, 9:22 AM IST

మీ కురులు ఒత్తుగా(THICK HAIR), పొడవుగా(LONG HAIR) పెరగాలన్నా... ఆరోగ్యంగా(HEALTHY HAIR) ఉండాలన్నా ఈ కింద సూచించే పద్ధతులను పాటిస్తే.. సరి.

మాడు, వెంట్రుకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి..

  • దిండు గలేబులను తరచూ మార్చాలి. ఎందుకంటే జుట్టుకు ఉండే నూనె(HAIR OIL), చుండ్రు వీటిపై పడటమే కాకుండా తిరిగి మళ్లీ తలలోకే చేరే అవకాశం ఉంటుంది.
  • ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకండి. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీళ్లతో స్నానం చేయొచ్చు.
  • కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును టవల్‌తో గట్టిగా దులుపుతుంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. ఇలా చేస్తే చిక్కులు పడిపోయి ఊడిపోతుంది.
  • మీ జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ప్రతి ఆరు వారాలకు ఒకసారి జుట్టు చివరి భాగాలను కాస్త కత్తిరించుకోండి.

మర్దనలు, పూతలు....

  • ప్రొటీన్లు ఉండే గుడ్డుతో అప్పుడప్పుడూ పూత వేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి, బాదం, జొజొబా లాంటి నూనెలతో మర్దనా చేసుకోవాలి. అప్పుడు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.
  • తలస్నానం చేసేటప్పుడు షాంపూ మాత్రమే సరిపోదు. కండిషనర్‌(CONDITIONERS) వాడాల్సిందే. ఎందుకంటే చాలా రకాల షాంపూలు మీ జుట్టులోని తేమను లాగేస్తాయి. కాబట్టి జుట్టుకు పోషణ, తేమ అందాలంటే కండిషనర్‌ కావాల్సిందే.

పైపూతలే కాదు.. ఆహారమూ అవసరమే..

  • జుట్టు ఒత్తుగా పెరగాలంటే పై పూతలే సరిపోవు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి.

1. విటమిన్​ ఎ: బంగాళా దుంప, క్యారెట్​, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలు, గుడ్లు

2. విటమిన్​ బి:పప్పులు ముఖ్యంగా మినపపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బాదం, మాంసం, చేపలు, పచ్చి ఆకుకూరలు

3. విటమిన్​ సి:స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్​, సిట్రిక్​ అధికంగా పండ్లు, బత్తాయి, నారింజ, సీజనల్​ పండ్లు(ఉదా. మామిడి, సపోటా మొదలైనవి)

4. విటమిన్​ డి:చేపలు, కాడ్​ లివర్ ఆయిల్​, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, బలవర్ధక ఆహారం

5. విటమిన్​ ఇ:పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, బచ్చలికూర, పాలకూర, వేరుశెనగలు

6. జింక్​:బచ్చలికూర, పాలకూర, గుమ్మడి విత్తనాలు, గోధుమలు

7. ప్రోటీన్స్​:మాంసం, చేపలు, పాలు

కెఫీన్ కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది..

  • రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు వెంట్రుకలు కూడా పెరుగుతాయి.
  • గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి రోజుకి 1-2 సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కెఫీన్ ఎలర్జీ ఉన్నవారు, రక్తం గడ్డం కట్టకుండా మందులు వాడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదు.

ఇదీ చూడండి:నల్లగా.. ఒత్తుగా.. కురులు నిగనిగలాడగా!

ABOUT THE AUTHOR

...view details