తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

weight loss tips : బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే! - tips to reduce weight

బరువు నియంత్రణ(weight loss tips)లో ఉంటేనే అందం, ఆరోగ్యం. అదుపు తప్పిన బరువు వల్ల... హార్మోన్ల సమస్యలు, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు.. ఒకటా రెండా? ఎన్నో వస్తాయి. మరి అలాంటి బరువు నియంత్రణలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.

బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

By

Published : Aug 4, 2021, 10:13 AM IST

రాత్రిపూట ఇవొద్దు...

చాలామంది మహిళలు తీపి పదార్థాలు లేనిదే భోజనం ముగించరు. వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, కెలొరీలు ఉంటాయన్న సంగతి మరవొద్దు. కాబట్టి తప్పనిసరిగా ఆహారంతోపాటు తీసుకోవాలనే నిబంధనకు నీళ్లు వదలండి. కొన్ని రోజులపాటు తియ్యటి పదార్థాలకు దూరంగా ఉండండి. వీటిని తగ్గించడం వల్ల క్రమంగా కెలొరీలు తగ్గుతాయి.

తినగానే స్నానం వద్దే వద్దు..

కొంతమంది భోజనం తర్వాత స్నానం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. అంతేకాదు... రక్తప్రసరణ వేగం పొట్ట నుంచి కింది భాగాలకు కూడా తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ జీర్ణ వ్యవస్థను నెమ్మదింప చేస్తాయి.

చల్లటి నీళ్లు తాగొద్దు...

ఆహారం తినే సమయంలో, తిన్న తర్వాత చల్లటి నీళ్లు అస్సలు తాగొద్దు. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరగకుండా అడ్డుకుంటాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే రకరకాల ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.

భోజనం వెంటనే...

పండ్లు నోనో! కొందరికి భోజనం తిన్న వెంటనే ఓ పండు తినే అలవాటు. ఇలా చేయడం వల్ల పండ్లు అరగవు. దాంతో అవి కడుపులో పులిసిపోతాయి. అంతేకాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి భోజనానికి గంట ముందు పండ్లు తినాలి. ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది.

తిన్న చోటే కూర్చోవద్దు!

కొందరు తిన్న చోటే అలాగే చాలాసేపు కూర్చొండి పోతారు లేదా పడుకుంటారు. ఈ రెండు పద్ధతులూ మంచివి కావు. తిన్న తర్వాత కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు నడవాలి. ఇలా చేస్తే ఆహారం సరిగా అరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details