తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పదిలమైన ఆరోగ్యానికి పది సూత్రాలు - live health tips

మనలో చాలామంది ఉరుకులు పరుగుల జీవనం సాగించడం తప్ప ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధపెట్టడం లేదు. కానీ దానివల్ల అనేక ఇబ్బందులొస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆరోగ్యాన్ని పదిలం చేసుకోడానికో పది సూత్రాలు...

Health tips, health tips
హెల్త్ టిప్స్, ఆరోగ్య చిట్కాలు

By

Published : Jun 29, 2021, 12:23 PM IST

  • ఉదయం అరగంటకు తక్కువ కాకుండా నడవటం లేదా వ్యాయామం తప్పనిసరి. ఇది రక్తప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
  • బ్రేక్‌ఫాస్ట్‌ ఆకలి తీరిస్తే సరిపోదు. శక్తినిచ్చే పోషకాహారం అయ్యుండాలి. అప్పుడే జీవకణాల్లో రసాయనిక చర్య (మెటబాలిజం) సవ్యంగా ఉంటుంది.
  • శరీరం డీహైడ్రేట్‌ కాకుండా నీళ్లు ఎక్కువ తాగాలి. రోజుకు రెండు లీటర్ల నీరు తాగగలిగితే సగం సమస్యలను నివారించినట్లే.
  • శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, జింక్‌- ఈ మూడూ తక్కువ కాకుండా చూసుకోవాలి. అందుగ్గానూ పాలు, యోగర్ట్‌, బాదం, నువ్వులు, జీడిపప్పు, అరటి మొదలైన పండ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, క్యారట్‌, సోయా, బఠాణీలు తింటుండాలి.
  • అధిక బరువు అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ పెరిగినట్లనిపిస్తే అప్రమత్తం కావాలి. థైరాయిడ్‌ సమస్య వుందేమో చెక్‌ చేయించుకుని అవసరమైన మందులు వాడాలి.
  • వేళకు తినడం, పడుకోవడం తప్పనిసరి. ఈ జీవనశైలిని అతిక్రమిస్తే అనారోగ్యం దాడిచేస్తుంది.
  • ఒత్తిడి, ఆందోళనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి కారణమేంటో సమీక్షించుకుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం కాకుంటే నిపుణుల సలహాలూ సహకారం తీసుకోవచ్చు.
  • నిరంతరం పనులు చేస్తూ అందరికీ ఆసరాగా ఉండటమే కాదు, మన గురించి మనం పట్టించుకోవాలని మర్చిపోవద్దు. రోజులో కాసేపు ఒంటరిగా, గడిపితే ప్రశాంతత చేకూరుతుంది. ఇది అలసటను పోగొడుతుంది.
  • శరీరానికి ఏడు గంటల నిద్ర అవసరం. నిద్ర పట్టకుంటే కాసేపు ధ్యానం చేస్తే సరి.
  • ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తున్నప్పటికీ ఏడాదికోసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా అంతర్లీనంగా సమస్య తలెత్తుతున్నట్లు తెలిస్తే అది పెద్దదై బాధ పెట్టకముందే చికిత్స చేయించుకోవచ్చు.

ఇదీ చదవండి :POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

ABOUT THE AUTHOR

...view details