తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మనుషులకు వచ్చినట్లు.. వేరే జీవులకూ జ్వరం వస్తుందా? - జంతువులకు జ్వరం వస్తుందా?

మనుషులకు జ్వరం ఎందుకు వస్తుంది? మనుషులకు వచ్చినట్లే ఇతర జీవులకూ జ్వరం వస్తుందా? - కె.సాయి శ్రీరామశరన్‌, 9వ తరగతి, పరంజ్యోతి స్కూల్‌, అమలాపురం

special story on Can other organisms get the flu?
మనుషులకు వచ్చినట్లు.. వేరే జీవులకూ జ్వరం వస్తుందా?

By

Published : Jul 28, 2020, 3:31 PM IST

మనుషులకు జ్వరం రావడానికి కారణం... వారి రక్తంలో పైరోజన్స్‌ అనే రసాయనాలు ప్రవహిస్తూ మెదడులోని హైపోథాలమస్‌ను జేరతాయి. శరీర ఉష్ణోగ్రతను హైపోథాలమస్‌ అదుపు చేస్తూ ఉంటుంది. ఈ పైరోజన్స్‌ హైపోథాలమస్‌లోని కొన్ని గ్రాహకాలతో బంధం ఏర్పర్చుకోవడంతో, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే జ్వరం.

  • శరీరంలో రోగం, అనారోగ్యం లేదా మరే ఇతర కారణాలు ఏర్పడినప్పుడు ప్రతిస్పందనగా హైపోథాలమస్‌ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
  • సాధారణంగా జలుబు, అతిసారవ్యాధి లేదా చెవి, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు, బ్లాడర్‌, మూత్రపిండాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు జ్వరం వస్తుంది.
  • జ్వరం రావడం వల్ల రోగనిరోధక కణాలు రక్తనాళాల గోడల వెంబడి పాకి అనారోగ్యం కల్గజేసే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
  • జ్వరం రోగం కాదు. జ్వరం రావడం వల్ల శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్‌లను రోగనిరోధక కణాలు చంపగల్గుతాయి.
  • పిల్లలకు పాలిచ్చే జంతువులన్నింటికి జ్వరం వస్తుంది. శీతల రక్త జంతువులకు ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చినప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత పెంచుకునేందుకు అవి వేడి ప్రాంతాలకు వెడతాయి. చేపలు, బల్లులు ఈ విధంగా చేస్తాయి.
  • చిలుకలకు జ్వరం రావడం చాలా అరుదైన విషయం. చాల్‌మైడిక్‌ సిటాసి అనే ఒక ప్రత్యేక తరహ బ్యాక్టీరియా వల్ల చిలుకలకు జ్వరం వస్తుంది. చిలుకల జ్వరం అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు దేశాల్లో వచ్చినట్లు ఆ దేశాలుతెలియజేశాయి.

- డాక్టర్‌ సి.వి.సర్వేశ్వరశర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details