తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

DON'T SKIP BREAKFAST: టిఫిన్‌ మానేస్తున్నారా... అయితే ఇవి తప్పవు!!

సమయం లేదనో, బరువు పెరుగుతామనో... చాలా మంది అమ్మాయిలు టిఫిన్‌ మానేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు...

DON'T SKIP BREAKFAST
టిఫిన్‌ మానేస్తే

By

Published : Sep 8, 2021, 8:00 AM IST

Updated : Sep 8, 2021, 8:20 AM IST

మనలో చాలామంది పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో టిఫిన్‌ని స్కిప్‌ చేస్తుంటారు. కానీ ఇక మీదట అలా చేయొద్ధు ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే రోజంతా ఆ శక్తి పనిచేస్తుంది. దానిలోని పోషకాలు మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తాయి.

బరువు పెరుగుతారు...మీరు చదివింది నిజమే. ‘తినకపోతే ఎలా బరువు పెరుగుతాం’ అనుకుంటున్నారా? ఉదయం తినడం మానేస్తే.. మధ్యాహ్నానికి ఆకలి పెరుగుతుంది. దాంతో అదుపు తప్పి తినే ప్రమాదం ఉంది. ఇదే బరువు పెరిగేందుకు కారణం. అలాకాకుండా పొద్దున్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది.. శరీరానికి సరిపడా శక్తి అందుతుంది.

నెలసరి సమస్యలు: తరచూ అల్పాహారం స్కిప్‌ చేస్తుంటే... జీవక్రియా రేటు తగ్గుతుంది. శరీరానికి సరైన పోషకాలు అందక హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. దాంతో నెలసరిలో మార్పులు, మలబద్ధకం వంటి ఇబ్బందులూ తప్పకపోవచ్చట.

ఉత్సాహంగా ఉండాలంటే... కొందరు అమ్మాయిలు చిన్న పనులు చేసినా అలసిపోతారు. ఇలాంటి వారు పొద్దున్నే తృణధాన్యాలతో కూడిన అల్పాహారం, గుడ్లు, పాలు వంటివి సమృద్ధిగా తీసుకుంటే... రోజంతా చురుగ్గా ఉంటారు.

అసలింతకీ పొద్దునే ఏం తింటే మంచిది.

గుడ్లు:వ్యాధి కారకాలతో పోరాడే పోషకాలున్న సూపర్‌ ఫుడ్‌ ఇది. ఒక గుడ్డు నుంచి దాదాపు ఏడు గ్రాముల ప్రొటీన్‌, 75 కెలొరీల శక్తి లభిస్తాయి. ఆకుకూరలు లేదా బ్రెడ్‌తో కలిపి ఆమ్లెట్‌గా, మఫిన్స్‌గా, ఉడికించి ఏ విధంగా అయినా తీసుకోండి. రోజూ కనీసం రెండు గుడ్లు తినాల్సిందే. అప్పుడే ఫలితం ఉంటుంది.

ఓట్స్‌:పీచుతో కూడిన వీటిని తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి అందుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీన్ని ఉప్మాలా చేసుకోవచ్ఛు లేదా పిండిలో కలిపి దోసెలు, ఊతప్పమ్‌, చిల్లాస్‌లా వేసుకుని తీసుకోవచ్ఛు ప్రాసెస్‌ చేయని ఓట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి.

పండ్లు, పెరుగు: వీటి సమ్మేళనమే ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పొచ్ఛు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను అంతం చేస్తాయి. పెరుగులోని ప్రొబయోటిక్స్‌, పీచు, పాలీఫినాల్స్‌ జీర్ణక్రియకు తోడ్పడతాయి. అంతేకాదు పెరుగులో ప్రొటీన్‌లు ఎక్కువగా ఉంటాయి.

దోసెలు, ఇడ్లీలు:వీటి నుంచి ప్రొటీన్‌లు, కార్బొహైడ్రేట్లు అందుతాయి. ఇవి త్వరగా జీర్ణమవడమే కాకుండా ఇమ్యూనిటీని ఇస్తాయి. రుచిగానూ ఉంటాయి.

ఇవీ చూడండి:

Last Updated : Sep 8, 2021, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details