తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

MORINGA: మునగాకుతో ఎన్నో లాభాలో తెలుసా! - మునగ ఆకు కూర

తక్కిన ఆకుకూరలతో పోలిస్తే మునగాకు (DrumStick Leaf )ని తక్కువగా తింటాం. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరిక వదలకుండా తింటారు.. మునగాకు తింటే ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.... ఇలా ఈ ఆకు వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

MORINGA
మునగాకు

By

Published : Jul 12, 2021, 7:44 AM IST

  • మునగాకు (DrumStick Leaf)లో బీటాకెరొటిన్‌ (beta Carotene) దండిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఈ ఆకుల నుంచి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. కూర, పప్పు, వేపుడు, పొడి... ఇలా వివిధ రకాలుగా మునగాకు (DrumStick Leaf)ను ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదు.
  • పాలతో పోలిస్తే మూడొంతుల క్యాల్షియం (calcium) ఇందులో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకు నుంచి దాదాపు నాలుగు వందల మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది. దీన్ని పొడిలా, కూరల్లో వేసుకుని తీసుకుంటే ఎముక సంబంధ సమస్యలు (Orthopedic problems) తలెత్తవు.
  • మునగాకులోని కొన్ని రసాయనాలు రక్తనాళాలు గట్టిగా మారకుండా చూస్తాయి. వీటిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ (Insulin resistance)ను తగ్గించే ఔషధగుణాలుంటాయి.
  • దీనిలోని పీచు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు కొవ్వును బయటకు పంపేస్తుంది. కాబట్టి ఊబకాయులు తమ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు.
  • ఈ ఆకుల్లో విటమిన్‌-సి కూడా మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • వీటిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. పీచు రక్తస్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. మధుమేహులు ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఆకులను తరచూ తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
  • మునగలోని ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌ శరీరంలోని మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ (Free radicals‌)ను నిర్మూలిస్తాయి.
  • పాలకూరతో పోలిస్తే దీంట్లో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండులో కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.
  • మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం (Chlorogenic acid) సహజంగా కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
  • శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ (Free radicals‌)తో పోరాడుతుంటాయి.
  • మునగలోని విటమిన్‌-ఎ (Vitamin-A) చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది..
  • ఈ ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్‌ ప్రొటీన్‌ (Carotene protein) ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జుట్టు పొడవుగా (Helps For Lengthy Hair) పెరిగేలా చేస్తుంది.
  • ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  • గొంతునొప్పి, దగ్గు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కప్పు వేడి మునగ సూప్‌ (Munaga soup) తాగి చూడండి. ఈ సమస్యలన్నీ ఇట్టే పోతాయి. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మునగాకుని తరచూ తీసుకుంటే మంచిది.

ABOUT THE AUTHOR

...view details