తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మేని నిగనిగలకు దానిమ్మనూనెను వాడేయండి - మేని నిగనిగలకు దానిమ్మనూనెను వాడేయండి

ఎర్రటి గింజలతో కంటికింపుగా, రుచిలో అద్భుతంగా ఉండే దానిమ్మలోని పోషకాలు చర్మ సౌందర్య పోషణకూ ఉపయోగపడతాయి. అదెలాగంటే..

face glowing tips with pomegranate oil
మేని నిగనిగలకు దానిమ్మనూనెను వాడేయండి

By

Published : Aug 28, 2020, 12:46 PM IST

  • దానిమ్మ గింజల్లో అధికమోతాదులో ఫ్లవనాయిడ్లు, పునిసిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో కీలకంగా పనిచేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల నుంచి తీసిన నూనెలో చెంచా తేనె కలిపి రోజూ ఉదయాన్నే రాసుకుని పావుగంటపాటు ఇంకనివ్వాలి. ఆపై కడిగేసుకుంటే చాలు. క్రమంగా మార్పు మీకే కనిపిస్తుంది.
  • దుమ్ము, ధూళి, కాలుష్యం లాంటి వాటి ప్రభావంతో చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. ఇలాంటప్పుడు దానిమ్మ రసంలో చెంచా పంచదార, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మం నునుపుగా మారి కాంతిమంతంగా కనిపిస్తుంది.
  • దానిమ్మ రసం స్కిన్‌ టోనర్‌గానూ పనిచేస్తుంది. ముఖం కడుక్కున్న తరువాత ఈ రసంలో కొద్దిగా యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి రాసుకోవాలి. ఇది చర్మంలోకి ఇంకి మెరుపుని తెచ్చిపెడుతుంది. ముల్తానీ మట్టిని పావుకప్పు దానిమ్మ రసంతో పేస్ట్‌లా చేసుకుని ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా కనిపిస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details