బీట్‌రూట్:
దీని పొట్టులో పీచు, విటమిన్-బి9, విటమిన్-సి, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. పొట్టు తీసేయడం వల్ల ఈ పోషకాలన్నింటినీ మనం కోల్పోతాం. కాబట్టి దీన్ని శుభ్రంగా నీటితో కడిగితే సరిపోతుంది. బీట్‌రూట్ రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తుంది. సలాడ్లతో కలిపి తినొచ్చు.
కీరా:
చాలామంది దీని తొక్క తీసిన తర్వాతే వాడుకుంటారు. దీనికి కారణం ఈ తొక్క వగరుగా ఉండటమే. కీరాలోని విత్తనాలు, పొట్టులోనే యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. అవి వ్యాధికారకాలతో పోరాడతాయి. కాబట్టి పోషకాలు మీ సొంతం కావాలంటే పొట్టు తీయకుండా కీరాను తీసుకోండి. అయితే తినేముందు శుభ్రంగా కడగడం మరవొద్దు.