వైరల్ ఇన్ఫెక్షన్లు ఎంత ప్రమాదరకమో కొవిడ్-19 ద్వారా ప్రపంచానికంతటికీ అనుభవంలోకి వచ్చింది. కేవలం అది మాత్రమే కాదు, ఫ్లూ నుంచి మీజిల్స్ వరకూ అన్నీ కూడా కొన్నిసార్లు విషమ పరిస్థితులకు దారితీస్తాయి. అందుకే తాజాగా వాటిమీద దృష్టి సారించినప్పుడు వీటిని తేలికగా తీసుకోకూడదు అంటున్నారు యోర్క్ యూనివర్సిటీ నిపుణులు. ఇన్ఫెక్షన్ల వల్ల అప్పటికప్పుడు వ్యాధి బారిన పడటమే కాదు, కొన్ని సంవత్సరాల తరవాతా దాని ప్రభావం ఉంటుందట. చిన్నతనంలో వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ భవిష్యత్తులో మూత్రాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చనీ, హెపటైటిస్-సి అనేది స్కిజోఫ్రెనియాకి దారి తీయవచ్చనీ అంటున్నారు. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు క్యాన్సర్ కేసుల్లో ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తున్నట్లు గుర్తించారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్లే సెర్వైకల్ క్యాన్సర్ వస్తుందనేది గతంలోనే తెలిసింది. అదేవిధంగా బికె పాలీయోమా వైరస్ వల్లే మూత్రశయ క్యాన్సర్ వస్తున్నట్లు కనుగొన్నారు. తరచూ సోకే వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా నాడీసంబంధిత వ్యాధులూ తలెత్తుతున్నట్లు భావిస్తున్నారు. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడమే ఉత్తమం అన్నమాట.
నెయ్యి తింటున్నారా?