కంటికి కనిపించని కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నాక వైరస్ సోకినా అది అంత తీవ్రంగా పరిణమించట్లేదని నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. అయితే ఒక పక్క టీకాల లభ్యత తక్కువగా ఉండడం ఒక సమస్య అయితే, మరోపక్క వ్యాక్సినేషన్ ప్రారంభమై నెలలు గడుస్తోన్నా, ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తోన్నా ఇప్పటికీ కొంతమంది టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలతో పాటు టీకా తీసుకున్న కొందరిలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రత్యేకించి వికారం, వాంతులు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.
వాటిని తగ్గించవచ్చు!
రోజును ఇలా ప్రారంభించండి!
టీకా రోజున నిద్ర లేవగానే పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకోవాలి. వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఆ తర్వాత అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తులసి ఆకులతో తయారుచేసిన హెర్బల్ టీని తాగాలి. టీని వడపోసే ముందు కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్‌ను తేనెను జోడిస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. హెర్బల్ టీ తయారుచేయాలంటే పైన చెప్పిన పదార్థాలన్నీ కచ్చితంగా ఉండాలనేం లేదు. అందులో కొన్ని ఉన్నా సరిపోతుంది.
బ్రేక్‌ఫాస్ట్
టీకా రోజున తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా కూరగాయలు కలిపి తయారు చేసిన పోహా లేదా ఉప్మాను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ఎంతో ఉత్తమం. వీటితో పాటు శెనగపిండితో చేసిన దోశలను కూడా తినచ్చు. ధనియాలు, పుదీనా, ఉసిరి కలిపి తయారుచేసిన చట్నీతో వీటిని తీసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఎగ్స్ తీసుకోవడం కూడా మంచిదే.
మిడ్ మీల్
బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కు మధ్యలో ఉసిరి, పుదీనా ఆకులతో కలిపిన ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుంటే మంచిది. ఇవేవీ అందుబాటులో లేకపోయినా కనీసం కొబ్బరి నీళ్లైనా తాగాలి.
లంచ్
మధ్యాహ్నం రోటీలు లేదా అన్నం, పప్పు, ఏదైనా సబ్జీ, చట్నీ, పెరుగును తీసుకోవాలి. కూరగాయలతో చేసిన కిచిడీ కూడా తీసుకోవచ్చు. చట్నీని తీసుకోవడం వల్ల రుచితో పాటు కొన్ని సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. ఇక పెరుగుతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
ఈవెనింగ్ స్నాక్స్