తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కొవిడ్‌తో వినికిడి సమస్య!

నరాలకు సంబంధించిన సమస్యలున్నవాళ్లలోగానీ కొన్ని రకాల మందుల దుష్ఫలితాల వల్లగానీ చెవిలో ఒకలాంటి మోత వస్తుంటుంది. ఈ రకమైన సమస్యనే టినిటస్‌ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కొవిడ్‌ వచ్చినవాళ్లలో కూడా ఈ సమస్య వస్తున్నట్లు గుర్తించారు మాంచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు. అంతేకాదు, కొవిడ్‌ కారణంగా వినికిడి శక్తి కూడా తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.

manchester university updates
మాంచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు

By

Published : Apr 4, 2021, 1:40 PM IST

గత ఏడాదిగా కొవిడ్‌ బాధితులను నిశితంగా పరిశీలించినప్పుడు 'టినిటస్'‌ చెవిలో ఒకలాంటి మోత వస్తుంటుందని మాంచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

కొవిడ్‌ వచ్చిన కొత్తలో వినికిడి సమస్యలున్న కేసులు తక్కువగా ఉన్నాయట. కానీ ఏడాది గడిచిన తరవాత 15శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందట. ఈ వైరస్‌ నేరుగా వినికిడి వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు, కొవిడ్‌ సోకిన సమయంలో రోగి ఎదుర్కొనే మానసిక ఒత్తిడివల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో, కొవిడ్‌ వచ్చి తగ్గాక వినికిడి లోపం కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది అని చెబుతున్నారు సదరు పరిశోధకులు.

ఇదీ చదవండి:కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details