తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

beauty tips: ఫేస్‌వాష్‌తో ప్రయోజనాలు చూద్దామా.. - ఫేస్‌వాష్‌తో ఎన్నో ప్రయోజనాలు

మీరూ ఫేస్‌వాష్‌ ఉపయోగిస్తారా? అయితే మీ ముఖం సురక్షితమన్నమాట. ఎందుకంటే ఫేస్‌వాష్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో చదవండి.

Let's see the benefits with facewash
beauty tips: ఫేస్‌వాష్‌తో ప్రయోజనాలు చుద్దామా..

By

Published : May 30, 2021, 7:06 PM IST

గాలిలోని దుమ్మూ ధూళితో చర్మం మీద మలినాలు పేరుకుంటాయి. ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్ర పరచుకోకపోతే మొటిమలు, టాన్‌ సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే కేవలం నీటితోనే కడగడం కాకుండా ఫేస్‌ వాష్‌ కూడా ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు.
*ఫేస్‌వాష్‌తో రోజుకి రెండుసార్లు ముఖాన్ని కడిగితే మొటిమలు, మచ్చలు, డార్క్‌ సర్కిల్స్‌, డార్క్‌ స్పాట్స్‌ మొదలైన చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మం మీద ముడతల్ని, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.
*ఫేస్‌వాష్‌తో ముఖాన్ని బాగా రుద్ది కడగడం వల్ల టాన్‌ పోయి చక్కగా శుభ్రమవుతుంది. రక్త ప్రసరణ మెరగవడంతో పాటూ చర్మం కాంతులీనుతుంది.

ABOUT THE AUTHOR

...view details