దేశంలో 63 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం పొందినా 37 శాతం మంది తక్కువ వేతనాలు పొందుతున్నారు. చదువు పూర్తయినా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడటమే ఇందుకు కారణం. అలాంటి వారు లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని మంచి మంచి స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు (Inspiration For Job Seekers) పొందారు.
మా ఊళ్లో మొదటి ఐటీ ఉద్యోగిని
మాది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కానూరు గ్రామం. పదోతరగతిలో నాకు మండలంలో మొదటి ర్యాంకు వచ్చింది. మా నాన్న వ్యవసాయం చేస్తారు. చిన్నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఆయనే నన్ను కళాశాలలో చేర్పించారు. ఇంజినీరింగ్‌లో ఈసీఈ తీసుకున్నాను. కళాశాలలో రూమ్ మేట్స్ సీఎస్‌ఈ కావడంతో కోడింగ్, టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ కోర్సుల్లో చేరాను. నా దగ్గర ల్యాప్‌టాప్ కూడా లేదు. ఊళ్లో ఇంటర్నెట్ సరిగ్గా వచ్చేది కాదు. దీంతో తెల్లవారుజామున లేచి మేడపైకి వెళ్లి తరగతులకు హాజరయ్యేదాన్ని. మొబైల్ నుంచే కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకున్నాను. జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం మొబైల్‌లో కష్టమైనా ఎట్టకేలకు పూర్తిచేశాను. ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి జంకేదాన్ని. నెక్ట్స్‌వేవ్ మెంటర్ల తోడ్పాటుతో దీన్ని అధిగమించి ఉద్యోగం సాధించాను. లాస్‌ఏంజిల్స్ కేంద్రంగా పనిచేసే సిస్‌టెక్‌లో డాటా ఇంజినీర్ ట్రెయినీగా కొలువు వచ్చింది. మా ఊళ్లోనే నేను తొలి ఐటీ ఉద్యోగినని చెబుతుంటే గర్వంగా అనిపిస్తుంది.
మూడేళ్ల తర్వాత కొలువు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో మంచి స్కోరుతోనే చదువు పూర్తి చేశా. ఫైనలియర్ వచ్చేవరకు కెరీర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇంజినీరింగ్ పూర్తికాగానే పెళ్లైంది. మూడేళ్లు ఇంట్లోనే ఉన్నాను. బాగా చదువుకుని ఖాళీగా ఉండటం ఎందుకు అనిపించింది. ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేయాలనే కల అయితే ఉండేది. అమ్మానాన్న, నా భర్త ప్రోత్సహించడంతో కొలువు కోసం అన్వేషణ మొదలైంది. అప్పుడే కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) 4.0 గురించి తెలియడంతో అందులో చేరాను. వ్యక్తిగత కారణాలతో మధ్యలో వదిలేశాను. తర్వాత ఎలాగైనా వదిలిపెట్టవద్దని పట్టుదలతో తరగతులు, లెక్చర్లు, సాధన, మాక్ ఇంటర్వ్యూలతో నైపుణ్యాలను పెంపొందించుకున్నాను. బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం సాధించాను.