తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Corona Effect : ఇంటి ఫుడ్​తో దృఢమైన ఊపిరితిత్తులు - corona effect on lungs

రెండో దశ కరోనా(second wave Corona) ప్రపంచాన్ని కకావికలం చేసింది. ఊపిరాడక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిన కొవిడ్ మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే.. వాటిని కాపాడుకోవడమొకటే మార్గం. మరి ఊపిరితిత్తులను రక్షించుకునేదెలా? ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలతో ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

tips For Lungs, Tips for Healthy Lungs
ఊపిరితిత్తుల కోసం, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులకు చిట్కాలు

By

Published : Jun 20, 2021, 2:21 PM IST

కరోనా సెకెండ్‌వేవ్‌(second wave Corona)లో 60 నుంచి 65 శాతంమంది ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్నట్టు, రెండుమూడు రోజుల్లోనే ఆక్సిజన్‌ 80కంటే పడిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దని, వ్యయప్రయాసల్లేకుండా ఇంట్లోనే లభ్యమయ్యే ఆహారాలతో దృఢంగా ఉంచుకోమని సూచిస్తున్నారు ఆహారనిపుణులు. అవేంటో చూద్దామా...

పసుపు :ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (తాపజనక) గుణాలు అధికంగా ఉండి ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రాత్రి పడుకునేముందు గోరువెచ్చటి పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగండి. అలాగే పసుపు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం, తులసి ఆకులతో కషాయం కాచుకుని తాగండి. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

తులసి :పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, సి విటమిన్‌, కెరోటిన్‌లు అధికంగా ఉండే తులసి ఆకులు ఊపిరితిత్తులకు మేలుచేస్తాయి. రోజుకు నాలుగైదు తులసి ఆకులు తినండి లేదా కషాయం చేసుకుని తాగండి.

అంజీరా :ఇందులో విటమిన్‌ ఎ,సి,కె లు, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌, ఐరన్‌లు విస్తారంగా ఉన్నందున ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details