కార్తిక మాసం శివుడికి అత్యంత పవిత్రమైంది. కాబట్టి ప్రతిరోజూ శివలింగానికి ఈ పవిత్ర జలంతో ఎలాగైతే అభిషేకం చేస్తుంటారో.. అలాగే మన దేహాన్ని కూడా శివలింగంలాగా భావించి ఆ నీటితోనే స్నానం చేస్తుంటాం. దీనివల్ల గతంలో చేసుకున్న పాప కర్మలన్నీ సమసిపోతాయని భక్తులందరి విశ్వాసం. అలాగే కొంతమంది రోజుకు మూడుసార్లు కూడా చన్నీటి స్నానం(Health Tips in Telugu) చేస్తుంటారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా మనలో ఉండే మలినాలను కడిగివేసే లక్షణం కేవలం నీటికే ఉంటుందన్నది కూడా చాలామంది అభిప్రాయం!
మెరుగయ్యే రక్త ప్రసరణ..
చన్నీటి స్నానం(Health Tips in Telugu) వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంచడంలో చల్లటి నీళ్లు తోడ్పడతాయి. ఈ స్నానం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. ఈ క్రమంలో శరీరంలోని మలినాలు, విషపదార్థాలు సులభంగా వేరై తొలగిపోతాయి.
శక్తినిస్తుంది..
చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు(Health Tips in Telugu) శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. దీంతో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్‌ను పీల్చుకుంటాం. అలాగే దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఆ రోజంతటికీ కావలసిన శక్తి శరీరానికి లభిస్తుంది.
వ్యాయామం తర్వాత..
వ్యాయామం చేసే క్రమంలో కాసేపటి తర్వాత మన శరీరంలోని కండరాలు అలసిపోయి 'విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది..' అనే భావన మనలో కలుగుతుంది. అలాగే ఎక్కువసేపు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కండరాలలో నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కండరాల పైన చల్లటి నీళ్లు పోస్తే ఉపశమనం లభిస్తుంది.