సీజన్‌లో ఎక్కువగా వచ్చే ద్రాక్ష ఆరోగ్యానికీ ముఖ్యంగా గుండెకు మంచిదనేది తెలిసిందే. అయితే ఇవి అతినీలలోహిత కిరణాల నుంచీ కాపాడతాయి అంటున్నారు బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ నిపుణులు. ద్రాక్షలో ఉన్న విటమిన్లూ యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్లనీ మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు, సూర్యరశ్మిలోని వేడికి చర్మకణాలు దెబ్బతినకుండానూ రక్షిస్తాయట.
ద్రాక్ష... మంచి సన్‌స్క్రీన్! - grapes uses
ద్రాక్ష ఆరోగ్యానికీ ముఖ్యంగా గుండెకు మంచిదనేది తెలిసిందే. అయితే ఇవి అతినీలలోహిత కిరణాల నుంచీ కాపాడతాయి అంటున్నారు బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ నిపుణులు. కాబట్టి ద్రాక్షని ఎడిబుల్ సన్‌స్క్రీన్‌గా చెప్పవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.
ఈ విషయాన్ని నిర్థారించడంకోసం ద్రాక్ష తినకముందూ తిన్న తరవాతా చర్మ కణాలమీద యూవీ కిరణాల ప్రభావం ఎలా ఉంటుందో లెక్కించి చూశారట. అందులో రెండు వారాలపాటు వీటిని క్రమం తప్పకుండా తిన్నవాళ్లలో యూవీ కిరణాల ప్రభావం చాలా తక్కువగా ఉందట. అంతేకాదు, చర్మ భాగాన్ని బయాప్సీ చేసి చూడగా- ద్రాక్ష పండ్లను తిని యూవీ కిరణాల తాకిడికి గురయినప్పటికీ వాళ్ల డీఎన్‌ఏలో ఎలాంటి మార్పూలేదని గుర్తించారు. అదే ద్రాక్షపండ్లు తినకుండా యూవీ కిరణాల ప్రభావానికి లోనయిన వాళ్లలో డీఎన్‌ఏలో మార్పులు కనిపించాయనీ ఇవి చర్మ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందనీ చెబుతున్నారు. కాబట్టి ద్రాక్షని ఎడిబుల్ సన్‌స్క్రీన్‌గా చెప్పవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.
ఇదీ చదవండి:ఇంధన ధర పెంపునకు నిరసనగా భట్టి సైకిల్ యాత్ర