ఆహార పొట్లాలపై కరోనా వైరస్ వ్యాపించి ఉంటే.. కూరగాయలు అమ్ముతున్న వ్యక్తికి కొవిడ్ ఉంటే.. ఇంటికి ఆహార ప్యాక్‌లను తీసుకువస్తున్న వ్యక్తి ఆ మహమ్మారి బారిన పడితే.. వాటిని అందుకున్న వారికి కరోనా ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం భద్రమో జాతీయ పోషకాహార సంస్థ సూచిస్తోంది.
ఎలా శుభ్రం చేయాలి.
- నల్లాద్వారా పారుతున్న నీటితో కూరగాయలు, పండ్లను కడగాలి లేదా 500 పీపీఎం డ్రాప్ ఉంచండి.. గోరు వెచ్చని నీటిలో క్లోరిన్, వాటిని ముంచి కడగాలి.
- క్రిమిసంహారక మందులు, శానిటైజర్లు నేరుగా కూరగాయల మీద చల్లవద్ధు అలా చల్లితే కూరగాయలు, పండ్లద్వారా మరింత హాని కలిగించేవారం అవుతాం.
- శుభ్రంగా కడిగిన కూరగాయలను, పండ్లను ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అలాగే మాంసం కూడా నల్లా ద్వారా వచ్చే నీటిలో కడగాలి.
- పాలు, పెరుగు ప్యాకెట్లను శుభ్రంగా కడిగి.. వాటిని పొడి వస్త్రంతో తుడిచి.. తడి ఆరాక వినియోగించడంతో పాటు.. ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
- దెబ్బతిన్న కోడి గుడ్లను తీసుకురావద్ధు ఫ్రిజ్‌లో అలాంటివి అస్సలే ఉంచరాదు.
ఆహార పదార్థాలను ఇంటికే తెప్పించుకుంటే..
- ఆహారం ప్యాకెట్లను శానిటైజ్ చేయాలి. అయితే ఆహారంపై పడకుండా చూసుకోవాలి. పై కవర్లను తీసి చెత్తకుండీలో వేయాలి.
- తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని.. ఎక్కడా చేతులతో తాకకుండా.. గరిటలు, చెంచాలతో అందరికీ వడ్డించాలి.
- వేడి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు.. చల్లటివి చల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి.
బయట ఏవైనా కొనేటప్పుడు..
- ఎప్పుడూ తాజా కూరగాయలు మాత్రమే కొనండి. వాడిపోయినవి, దెబ్బతిన్నవి కొనొద్ధు.
- మీరు సొంతంగా చేతి సంచిని తీసుకెళ్లండి. మీకు కావాల్సిన కూరగాయలపైనే చేయి వేయండి.
- మీరు తీసుకున్న కూరగాయలు మీ శరీరానికి, దుస్తులకు తగలకుండా జాగ్రత్తగా సంచిలో వేసి తీసుకురావాలి.
- మాంసం కొంటే.. అప్పుడే తాజాగా కోసిన మాంసాన్నే కొనండి. శుభ్రతను పాటిస్తూ ఫ్రిజ్‌లో భద్రపరిచినవి తీసుకోవాలంటే.. అతి చల్లగా ఉండేలా తీసుకుని మనం వండేవరకూ భద్రత పాటించండి.
- మీరు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాక మీ చేతులు సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి. 40 నుంచి 60 క్షణాలు సబ్బుతో బాగా రుద్దుకోవాలి.