కొందరు ఎప్పుడూ మెడను వంచి ముందుకు వంగిపోతుంటారు. దీంతో కొందరు గూని వచ్చినట్టుగానూ కనిపిస్తుంటారు. వెన్నెముక ముందుకు వంగిపోయినప్పుడు ఊపిరితిత్తులు విప్పారటానికి తగినంత స్థలం దొరకదు. దీంతో ఆక్సిజన్ అంతగా అందదు. అదేపనిగా ముందుకు వంగిపోతుండటానికి అలవాట్లు, పనుల వంటివీ కారణం కావొచ్చు. అందువల్ల భంగిమను సరిచేసుకోవాలి.
మెడను వంచి ముందుకు వంగిపోతే.. కష్టమే! - exercise to sit straight
కొందరు ఎప్పుడూ మెడను వంచి ముందుకు వంగిపోతుంటారు. దీనివల్ల గూని వచ్చినట్టు కనిపిస్తారు. అందుకే.. కూర్చున్నా.. నిల్చున్నా.. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఉన్నపాటుగా ఇప్పుడు వెన్నముక నిటారుగా ఉండేలా కూర్చోవాలంటే కష్టమే. ఐతే.. వ్యాయామంతో దీన్ని అలవాటు చేసుకోవచ్చు.
మెడ వంచి నష్టమే, వంగితే నష్టమే
కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామంగా- గోడకు వీపును ఆనించి, పాదాలను కాస్త ఎడంగా పెట్టి తిన్నగా నిల్చోవాలి. తల, భుజాలు, తుంటి, మడమలు గోడకు తాకేలా చూసుకోవాలి. అలాగే కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు చిన్న తువ్వాలును చుట్టి వీపు కింది భాగాన పెట్టుకోవాలి. పడుకున్నప్పుడు దిండు మరీ ఎత్తుగా లేకుండానూ చూసుకోవాలి.
- ఇదీ చదవండి :Viral: చిన్న కారణం.. పెద్ద గొడవ..