కాలంతో పనిలేకుండా కొందరి పెదాలు పొడిబారుతుంటాయి. ఎండాకాలం, శీతాకాలంలో డీహైడ్రేషన్ సమస్య తోడై పగులుతుంటాయి కూడా. దానికి పరిష్కారాలు ఇవీ...
గ్రీన్ టీ... టీ, కాఫీలు తాగడం వల్లా పెదాలు నల్లగా మారతాయి. బదులుగా ఓ కప్పు గ్రీన్ టీ తీసుకోండి. ఇందులోని పాలీఫినాల్స్ ఎండ తీవ్రతకు గురైన పెదాలకు సాంత్వన కలిగిస్తాయి. అలానే వాడేసిన గ్రీన్ టీ బ్యాగులతో అధరాలపై మృదువుగా మర్దనా చేసినా నలుపుదనం తగ్గుతుంది.
పెరుగు... క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. దాంతో పాటు పెరుగులో రెండు కుంకుమ పువ్వు రేకలు వేసి పెదాలకు రాయండి. కాసేపాగి కడిగేస్తే తేమగా, తాజాగా కనిపిస్తాయి.