- పాలకూరతో పోలిస్తే దీంట్లో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండులో కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.
- మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
- శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంటాయి.
- మునగలోని విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది..
- ఈ ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్ ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్ జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
- ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
రోగనిరోధకశక్తిని పెంచుకోవాలంటే మునగాకు తినాల్సిందే!
వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబూ, దగ్గులాంటి ఇబ్బందుల నుంచీ బయటపడవచ్చు. మునగాకు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో చూడండి...
drumstick leaves