రాత్రి సమయంలో పని చేస్తున్నప్పుడు చాలా మంది గంటకోసారి నిద్ర రాకుండా కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ దాని ప్రభావం ఆ తరవాతి నిద్ర మీదా ఉంటుందనీ అందుకే బాగా నిద్ర వస్తుందీ అనుకున్నప్పుడు ఓ పదీ ఇరవై నిమిషాలు కునుకు తీసి ఆ తరవాత కాఫీ తాగితే బుర్ర చురుగ్గా పనిచేస్తుందట. ఎందుకంటే..
రాత్రి వేళల్లో గంటకో కప్పు కాఫీ.. ఆరోగ్యానికి హానికరం - drinking coffee at night is injurious to health
రాత్రివేళల్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చాలామంది నిద్ర రాకుండా గంటకోసారి లేదా రెండు మూడు గంటలకోసారి కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు.
ఓ కునుకు తీసి మళ్లీ లేస్తే మత్తు వదలనట్లే ఉంటుంది. అప్పుడో కప్పు కాఫీ తాగితే అదంతా పోయి, అందులోని కెఫీన్ కిక్కుతో బుర్ర పాదరసంలా పని చేస్తుందని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వీళ్లు తెల్లవారుజామున మూడుగంటల సమయంలో ఓ అరగంట పడుకుని లేచాక 200 మి.గ్రా కెఫిన్ డోసు ఇచ్చి, 45 నిమిషాల తరవాత వాళ్ల పనితీరుని పరిశీలించగా కెఫిన్ డోసు ఇవ్వని వాళ్లకన్నా ఇచ్చిన వాళ్లు అలర్ట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సో, కునుకు తరవాత కాఫీ మంచిదేనన్నమాట.
- ఇదీ చూడండిసాయం చేస్తే ఆరోగ్యానికీ మంచిదే!