వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అలా అని భార్య, కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే వారిని కోప్పడుతూనో, అరుస్తూనో పెద్ద పెద్దగా మాట్లాడొద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే బయటకు వెళ్లి మాట్లాడాలి. లేకపోతే మీ వ్యక్తిగత విషయాలని మీరే అందరికీ చెప్పిన వారవుతారు.
ఆలస్యం...
లేటుగా వచ్చే ఉద్యోగి మీద.. పై అధికారులకు, సహోద్యోగులకు మంచి అభిప్రాయం ఉండదు. పైగా సమయానికి పని కూడా పూర్తి కాదు. అప్పుడు మీరే మాటపడాల్సి వస్తుంది.
ఫిర్యాదులు వద్దు...
కొందరు ప్రతి చిన్న విషయానికీ తోటి ఉద్యోగులపై బాస్‌కి ఫిర్యాదు చేస్తుంటారు. నిజంగా ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే ఫిర్యాదు వరకు వెళ్లాలే తప్పా.. ప్రతి చిన్న విషయానికీ కంప్లైట్ బాక్స్‌లా మారొద్దు.