తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

dark circles home treatment: కళ్ల కింద నల్లని చారలా? - డార్క్​సర్కిల్​కు చిట్కాలు

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటివి కళ్లకింద నల్లటి వలయాలు (dark circles), గీతలు ఏర్పడేలా చేస్తాయి. ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.

dark circles home treatment
కళ్లకింద నల్లటి వలయాలు

By

Published : Sep 21, 2021, 10:11 AM IST

  • బొప్పాయి గుజ్జు, టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకుని కళ్లకిందే కాదు... ముఖమంతా రాయండి. దాన్ని అలానే పదినిమిషాల పాటు వదిలేసి ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. ఇలా కనీసం రెండు రోజులకోసారైనా చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.
  • పావుకప్పు బొప్పాయి ముక్కల్లో రెండు చెంచాల చిక్కటిపాలు, చెంచా తేనె వేసి బాగా మెత్తగా ముద్దలా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించాలి. వారంలో రెండుసార్లు ఈ పూతను ప్రయత్నించాలి. తేనె చర్మానికి తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే పాలలోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.
  • బంగాళాదుంప రసంలో కొద్దిగా ఆముదం కలిపి మృదువుగా కళ్లకింద, చెంపలు, నుదురు వంటి చోట్ల రాయండి. చారలు (dark circles) తగ్గుతాయి. వన్నె పెరుగుతుంది.
  • వాడేసిన గ్రీన్‌టీ బ్యాగ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి... ఆపై దాన్ని నిద్రపోయే ముందు మూసిన కనురెప్పలపై ఉంచండి. ఇలా పది నిమిషాలు ఉంచితే సరి. క్రమంగా మీరు కోరుకున్న మార్పు సొంతమవుతుంది. కళ్లకు తగిన విశ్రాంతి (dark circles) లభిస్తుంది.
  • రోజూ బయట నుంచి ఇంటికి వచ్చాక చల్లటి పాలను కంటి చుట్టూ రాసుకోవాలి. ఆపై ఆరాక కడిగేసుకుంటే కంటి చుట్టూ ఉండే నలుపు(dark circles), ముడతలు వంటివి తగ్గుతాయి.
  • నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులనే వాడాలి.
  • కంటినిండా నిద్రపోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. విటమిన్‌-కె ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • కంటికింద నూనెగ్రంథులేవీ ఉండవు. పైగా ఆ ప్రాంతం చాలా సున్నితం కాబట్టి మేకప్‌ తీసేటప్పుడు అక్కడ గట్టిగా రుద్దకూడదు.
  • రోజులో అయిదారు సార్లు కంటికి చిన్నపాటి మసాజ్‌ చేసుకోవాలి.
  • రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి/ ఆముదం/ బాదం నూనెతో కంటి కింద మృదువుగా మర్దనా చేసుకోవాలి.
  • చర్మ తత్వానికి సరిపోయే నైట్‌ ఐ క్రీమ్‌ను రాసుకోవాలి.
  • అరటిపండు తొక్కతో కంటికింద మృదువుగా రాయడం వల్ల అక్కడి నలుపుదనం (dark circles) తగ్గుతుంది.
  • నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యిని కళ్లకింద మృదువుగా రాస్తే సరి.
  • చల్లటి కీరా ముక్కలను కళ్ల చుట్టూ అయిదు నిమిషాలపాటు మృదువుగా రాయాలి.
  • బంగాళాదుంప రసాన్ని కళ్ల కింద రాసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. అలాగే చెంచా చొప్పున టొమాటో, నిమ్మరసం, కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు రాయాలి.
  • కెఫిన్‌ ఉండే విటమిన్‌-సి క్రీమ్‌ రాసుకోవడం వల్ల ఈ నల్లటి వలయాలు (dark circles) తగ్గే అవకాశం ఉంది. రోజూ చిన్న డార్క్‌చాక్లెట్‌ ముక్క, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే వాల్‌నట్స్‌ తీసుకోవాలి.

ఇదీ చూడండి:బొప్పాయితో భలే అందం.. ఇక మీ సొంతం

ABOUT THE AUTHOR

...view details