తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

బరువు తగ్గాలన్నా.. బరువు పెరగాలన్నా.. - custurd apple in winter season

చలికాలంలో మాత్రమే లభించే మధురమైన పండు... సీతాఫలం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే దీంట్లో రుచితోపాటు పోషకాలూ అధికమే. అవేమిటంటే..

custurd apple in winter season helps for good health
సీతాఫలంతో బరువు తగ్గుదల

By

Published : Nov 8, 2020, 10:54 AM IST

  • ఈ పండులో విటమిన్‌-ఎ, బి6, మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం, పీచు పదార్థం, ఇనుము ఉంటాయి.
  • శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి అధిక బరువును నియంత్రిస్తుంది.
  • నరాల బలహీనతను తగ్గించి కండరాల పట్టుత్వాన్ని పెంచుతుంది.
  • బలహీనంగా ఉన్నవాళ్లు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా బరువు పెరుగుతారు.
  • దీంట్లోని విటమన్‌-ఎ దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మారోగ్యాన్నీ కాపాడుతుంది.
  • దీంట్లో ఉండే మెగ్నీషియం, విటమిన్‌-బి గుండె వ్యాధుల నుంచి కాపాడతాయి.
  • రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు వృద్ధి చేస్తుంది కూడా.
  • దీంట్లోని మెగ్నీషియం వల్ల కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు.
  • దీంట్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగురుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • ఉదర సంబంధిత సమస్యలు గ్యాస్‌, ఎసిడిటీ బారి నుంచి కాపాడుతుంది.
  • అధిక రక్తపోటును నియంత్రించడానికి తోడ్పడుతుంది. టైప్‌-2 మధుమేహం నుంచి రక్షణ కల్పిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details