నోటి పరిశుభ్రత కరోనా వ్యాప్తిని చాలావరకూ అడ్డుకుంటుందని వాళ్ల తాజా అధ్యయనాల్లో తేలిందట. చిగుళ్ల వ్యాధులకీ శ్వాసకోశ వ్యాధులకీ సంబంధం ఉందని గతంలోనే స్పష్టమైంది. అదేమాదిరిగా దంత సమస్యలు ఉన్నవాళ్లలోనే కొవిడ్ మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
Dental Care : నోటి పరిశుభ్రతతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట
దంతసిరి బాగుంటే ఆరోగ్యం బాగున్నట్లే అంటుంటారు. చిగుళ్లవ్యాధులూ దంతక్షయం లేకుండా నోరు పరిశుభ్రంగా ఉంటే, కొవిడ్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పెరిడాంటాలజీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.
దంతసంరక్షణ, దంతసంరక్షణతో కరోనా పరార్
అంతేకాదు, దంత సమస్యలు లేనివాళ్లు కొవిడ్ నుంచి త్వరగా కోలుకుంటే, చిగుళ్ల వ్యాధులు ఉన్నవాళ్లకి ఎక్కువ సమయం పట్టిందట. రెండోదశ కొవిడ్ కేసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించిందట. పైగా కొవిడ్ వచ్చి తగ్గాక వస్తోన్న మ్యూకర్‌మైకోసిస్ అనే ఫంగస్ కూడా ఎక్కువగా చిగుళ్లకే వస్తుంది. కాబట్టి రెండుసార్లు బ్రష్ చేయడం, తరచూ పుక్కిలించడం వంటి వాటివల్ల కొవిడ్ బారి నుంచి కొంతవరకూ సురక్షితంగా ఉండొచ్చు అంటున్నారు.