మనిషి సామాజిక ప్రవర్తన అనేది మెదడులోని ప్రిఫ్రాంటల్ కార్టెక్స్‌లోని కణాలమీద ఆధారపడి ఉంటుందని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌కు చెందిన పరిశీలకులు గుర్తించారు. ఇందుకోసం పిల్లఎలుకల్ని తీసుకుని రెండువారాలపాటు మిగిలినవాటితో కలవనీయకుండా ఉంచారట. ఆ తరవాత వాటిని గమనించగా- మెదడులోని ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలోని న్యూరాన్ల నుంచి మిగిలినవాటికి సంకేతాలు సరిగ్గా అందడం లేదని తెలిసింది.
పిల్లలు ఒంటరిగా ఉంటున్నారా? - children addicted to digital media in lockdown
ఒంటరితనం మానసికంగానే కాదు, శారీరక ఆరోగ్యానికీ మంచిది కాదన్నది తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఇది అందరికీ తప్పనిసరిగా మారింది. దాంతో ప్రపంచం మొత్తం డిజిటల్ మీడియా ద్వారానే కలిసి ఉంటోంది. అయితే దీనివల్ల పిల్లల మెదడు భాగంలోని కొన్ని కణాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు మౌంట్ సినాయ్ హాస్పిటల్‌కు చెందిన పరిశీలకులు.

ఆపై కొంతకాలానికి అవి స్తబ్దుగా మారడం గమనించారు. అయితే వాటిని అలాగే వదిలేయకుండా ఆప్టోజెనిటిక్స్, కీమోజెనిటిక్స్ పద్ధతుల్ని ఉపయోగించి ఆ భాగంలోని కణాలను ప్రేరేపించడంతో అవి మళ్లీ చురుకుగా మారినట్లు గుర్తించారు. కాబట్టి ఐసొలేషన్ వల్ల పిల్లల్లో సామాజిక ప్రవర్తనకు సంబంధించిన లోపాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశీలన ఆధారంగా రకరకాల మానసిక వ్యాధుల కారణంగా సామాజిక ప్రవర్తన సరిగ్గా లేనివాళ్లలో కూడా ఆ కణాల్ని లైట్‌థెరపీ వంటి చికిత్సల ద్వారా ప్రేరేపించడం ద్వారా ఆ లక్షణాన్ని తగ్గించవచ్చు అంటున్నారు.
TAGGED:
loneliness in children