తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఉదయాన్నే మజ్జిగ తాగండి.. వేసవి తాపం తగ్గించుకోండి! - తెలంగాణ వార్తలు

వేసవి తాపాన్ని తగ్గించే వాటిల్లో మజ్జిగ ముందుంటుంది. అంతేకాదు బరువును నియంత్రణలో ఉంచుతూ కడుపును చల్లబరుస్తుంది. ఇంకా మజ్జిగ తాగితే ఏమేం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

buttermilk for good health, buttermilk benefits
మజ్జిగతో ప్రయోజనాలు, ఆరోగ్యం కోసం మజ్జిగ

By

Published : Apr 17, 2021, 6:48 AM IST

మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇక వేసవి తాపాన్ని తగ్గించే పదార్థాల్లో మజ్జిగ ముందు ఉంటుంది. దానిలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్‌ బి కాంప్లెక్స్‌ వంటి పోషకాలు ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు తీసుకుంటే కావల్సిన శక్తి అందుతుంది. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తాగితే మంచిది.


మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. దీనిలోని లాక్టోజ్‌, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా జీర్ణాశయ సమస్యలు రావు. అంతేకాక మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌ సమస్యలు తగ్గిపోతాయి. ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్‌ సమస్య తగ్గాలంటే మజ్జిగ తాగితే సరి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

ఇదీ చదవండి:కొవిడ్‌ విజృంభణ.. ఆలయాల్లో నిరాడంబర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details